Home తాజా వార్తలు ఆర్టీసీ కార్మికులపై మేము కఠినంగా లేము: సిఎం కెసిఆర్

ఆర్టీసీ కార్మికులపై మేము కఠినంగా లేము: సిఎం కెసిఆర్

CM-KCR

హైదరాబాద్: ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీ ఐదు గంటలపాటు కొనసాగింది. ఇందులో 49 అంశాలపై చర్చించినట్టు సిఎం కెసిఆర్ తెలిపారు. ఈ సందర్భంగా సిఎం మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డిఎ మంజూరు చేశామన్నారు. అన్నిరంగాల్లో తెలంగాణ పటిష్టంగా ఉండాలని చెప్పారు. టిఆర్ఎస్ ప్రభుత్తం తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలిచ్చినయి. తీవ్ర ఆర్థికమాంద్యాన్ని కూడా తట్టుకున్నామని చెప్పారు. గత 5 సంవత్సరాలు వృద్ధిరేటు 21 శాతం ఉండేది. ఈయేడు వృద్ధిరేటు చాలా పడిపోయింది. రవాణారంగంలో వృద్ధిరేటు మైనస్ కు చేరింది. నేను అమితంగా ప్రేమించేది తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలను అందరి సంక్షేమాన్ని దృష్టిలోపెట్టుకొని పని చేస్తున్నం.

తెలంగాణలో జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రజలు టిఆర్ఎస్ ఆశీర్వదించిన్రు. 5100 ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు దురహంకార పూరితంగా సమ్మెకు వెళ్లారు. ఆర్టీసీ సమ్మె వల్ల ఎన్నో విపరిణాలమాలు జరిగాయి. ఆర్టీసిని ఎట్టిపరిస్తితుల్లో ప్రభుత్వంలో విలీనం చేసేది లేదు. ఆర్టీసీ ప్రస్తుతం 10,400 బస్సులు నడుపుతున్నది. అందులో 2100 అద్దె బస్సులు నడుస్తున్నయి. ఇప్పుడు కొత్తగా మరో 3000 ప్రైవేటు బస్సులకు అనుమతి ఇస్తున్నం. ఆర్టీసీ సమ్మె న్యాయబద్దమైంది కాదని లేబర్ కమిషనర్ ప్రకటించింది. ఆర్టీసీ సిబ్బంది పనికిమాలిన డిమాండ్లతో సమ్మెకు వెళ్లారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆర్టీసీ లేదు. రవాణారంగంలో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. కేంద్ర చట్టం ప్రకారమే నిర్ణయం తీసుకున్నం. ఆర్టీసీ కార్మికులపై మేము కఠినంగా లేము.

నాలుగేళ్లలో ఆర్టీసీ కార్మికులకు 67 శాతం జీతాలు పెంచినం. పలువురు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసినం. 23 కేటగిరీల ఉద్యోగులకు జీతాలు పెంచినం. చేనేత కార్మికులు, రైతులు ఆత్మహత్యలు నివారించినం. ఆర్టీసీ కార్మికులు రోడ్డున పడాలని మేము కోరుకోవడం లేదు. యూనియన్ల మాయలోపడి మీ జీవితాలు ఆగం చేసుకోవద్దు. నవంబర్ 5 తేదీ అర్థరాత్రిలోగా ఆర్టీసీ కార్మికులు బేషరతుగా ఉద్యోగంలో చేరొచ్చు. ఆర్టీసీ సమ్మె వల్ల ఎన్నో విపరిణామాలు జరిగాయి. లాభాలు వచ్చే రూట్లనే ఆర్టీసీకి కేటాయిస్తం. నష్టాలొచ్చే రూట్లను ప్రైవేటుకు కేటాయిస్తం. ఆర్టీసీని విలీనం చేస్తే మిగితా కార్పొరేషన్లు కూడా అదే డిమాండ్ చేస్తాయని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

CM KCR Press Meet On TSRTC Strike