Saturday, April 20, 2024

సిఎం కెసిఆర్ కులవృత్తులను ప్రోత్సహిస్తున్నారు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్

- Advertisement -
- Advertisement -

సిఎం కెసిఆర్ కులవృత్తులను ప్రోత్సహిస్తున్నారు
గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది- మంత్రి శ్రీనివాస్‌గౌడ్


మనతెలంగాణ/హైదరాబాద్: కులవృత్తులను ప్రోత్సహించేందుకు సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఉప్పల్ భగాయత్‌లో గౌడ హాస్టల్ నూతన భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలకు విలువైన భూములను కేటాయించిన ఘనత సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌లకే దక్కుతుందన్నారు. సిఎం కెసిఆర్ హైదరాబాద్‌లో కల్లు అమ్మకాలకు అనుమతించారని, గీతవృత్తిని ప్రోత్సహించారని ఆయన తెలిపారు. గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను సిఎం ప్రవేశపెట్టారన్నారు. ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీని ప్రవేశపెట్టి గౌడ వృత్తిదారులకు సిఎం మేలు చేస్తున్నారన్నారు. గీత వృత్తిని ప్రోత్సహించడానికి తెలంగాణకు హరితహరం కార్యక్రమంలో భాగంగా 3 కోట్ల 75 లక్షల తాటి, ఈత మొక్కలను నాటారన్నారు. ఆబ్కారీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామ పంచాయతీలో సుమారు 2 వేల మొక్కలతో తాటి, ఈత వనాలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సుమారు రూ.10 కోట్ల గీత కార్మికుల బకాయిలను సిఎం కెసిఆర్ రద్దు చేశారన్నారు. ప్రమాదవశాత్తు మృతిచెందిన గీత కార్మికుల ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను పెంచారన్నారు. వెనుకబడిన తరగతుల విద్యార్థుల విద్య కోసం వందలాది గురుకులాలను స్థాపించి విద్యాభివృద్దికి సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారన్నారు. తాటి, ఈత చెట్ల పన్నులను శాశ్వతంగా రద్దు చేశారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, మాజీ ఎంపిలు బూర నర్సయ్యగౌడ్, మధుయాష్కీ తదితరులు పాల్గొన్నారు.

CM KCR promoting caste based professions: Min Srinivas Goud

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News