Saturday, April 20, 2024

హైదరాబాద్ చైతన్యవంతమైన నగరం: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR Public Meeting At LB Stadium

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో ఓటేసే ముందు ప్రజలు ఆలోచించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. సిఎం కెసిఆర్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ… నాయకుల పనితీరును ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు. హైదరాబాద్ చైతన్యవంతమైన నగరం. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ సాధించకున్నామని పేర్కొన్నారు. ఎన్నికల వేళ ఓటర్లు విచక్షణాధికారం వినియోగించాలని పిలుపునిచ్చారు. ఓటర్లు ఎప్పుడూ నాయకుల విజన్ చూడాలని కెసిఆర్ కోరారు. పార్టీల అజెండాపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. వాదాలు, అపవాదాలు, అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ వచ్చింది. రాష్ట్ర విభజన జరిగితే నీళ్లు రావు, కరెంటు ఉండదని ప్రచారం చేశారని గుర్తుచేశారు. కొత్త రాష్ట్రంలో నక్సలైట్లు పెరుగుతారని ప్రచారం చేశారు. ఉద్యమ నాయకుడిగా నా ఉపన్యాసం కోసం ప్రజలంతా ఎదురుచూసేవారు. టిఆర్ఎస్ ఉద్యమ బాధ్యత ముగిసింది, రాజకీయ పరిణతి సాధించింది. ప్రభుత్వ పనితీరుపై చర్చ జరగాలని సిఎం తెలిపారు.

CM KCR Public Meeting At LB Stadium

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News