Home తాజా వార్తలు ఎంఎల్ఎ బండ్ల కుటుంబాన్ని పరామర్శించిన కెసిఆర్

ఎంఎల్ఎ బండ్ల కుటుంబాన్ని పరామర్శించిన కెసిఆర్

CM KCR reached to MLA Bandla krishna mohan reddy

జోగులాంబ గద్వాల్: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పరామర్శించారు. ఎమ్మెల్యే తండ్రి వెంకట్రామ్ రెడ్డి ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు గురువారం ముఖ్యమంత్రి హైదరాబాద్ నుండి గద్వాల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా వెంకట్రామ్ రెడ్డి చిత్ర పటానికి సిఎం కెసిఆర్ పుష్పాంజలి ఘటించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎమ్మెల్యేలు సి లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, వి ఎం అబ్రహం, మర్రి జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, ఎస్ రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, జైపాల్ యాదవ్, పట్నం నరేందర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య తదితరులు ఉన్నారు.