Home తాజా వార్తలు వరంగల్‌లో ఎంజిఎంను సందర్శించిన కెసిఆర్

వరంగల్‌లో ఎంజిఎంను సందర్శించిన కెసిఆర్

CM KCR Review with Officials on Corona situation

హైదరాబాద్: సిఎం కెసిఆర్ హైదరాబాద్ నుంచి వరంగల్‌కు చేరుకున్నారు. ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల వద్ద హెలిప్యాడ్ వద్ద సిఎంకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి సిఎం కెసిఆర్ నేరుగా ఎంజిఎం ఆస్పత్రికి చేరుకున్నారు. కరోనా రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు అవసరమైన మెడిసిన్ గురించి వాకబు చేశారు. ఆస్పత్రిలో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, రెమ్‌డెసివర్, ఇతర మందుల లభ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి గురించి అక్కడి అధికారులతో కెసిఆర్ సమీక్షలు నిర్వహించారు.