Friday, March 29, 2024

ప్రాదేశిక ప్రాంతాలు

- Advertisement -
- Advertisement -

19 ఇరిగేషన్ ప్రాదేశిక ప్రాంతాలు

ఒక్కో ప్రాదేశిక ప్రాంతానికి ఆరుగురు ఇఎన్‌సిలు

నీటిపారుదల రంగంలో వచ్చిన భారీ మార్పులకు అనుగుణంగా పునర్వవస్థీకరణ
అన్ని రకాల జలవనరుల వ్యవహారాలకు ఒకే పర్యవేక్షణ అధికారి
ప్రధాన ప్రాజెక్టులలో భాగంగా ఉన్న కొద్ది పాటి లింకులు త్వరగా పూర్తి
ప్రాదేశిక సిఇలలో ముగ్గురు సీనియర్లకు ఇఎన్‌సి కేడర్ బాధ్యతలు
పెరగనున్న ఉన్నతాధికారుల పదవులు, అదనంగా 945 పోస్టులు
అదనంగా ముగ్గురు సిఇలు, 10మంది ఎస్‌ఇలు, 28మంది ఇఇలు, 214 డిఇఇలు,
360 ఎఇఇలు, 70 మంది టెక్నికల్ ఆఫీసర్లు, 69 అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్లు,
52 మంది జూ.టెక్నికల్ ఆఫీసర్లు, 14 మంది నాన్ టెక్నికల్ పర్సనల్ అసిస్టెంట్లు,
51 మంది సూపరింటెండెంట్లు, 71 మంది రికార్డు అసిస్టెంట్లు
వర్షాల వల్ల దెబ్బతిన్న చెరువులన్నిటికి మరమ్మతులు : ప్రగతిభవన్ సమీక్షలో సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో వచ్చిన పెను మార్పులకు అనుగుణంగా జల వనరుల శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ చేసినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఇందులో భాగంగా భారీ, మధ్య, చిన్నతరహా నీటిపారుదల విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఒకే ప్రాంతంలో ఉన్న అన్నిరకాల జలవనరుల శాఖ వ్యవహారాలను ఇకపై ఒకే అధికారి పర్యవేక్షించేలా పునర్వ్యవస్థీకరణ చేశామన్నారు. ఇందుకు అనుగుణంగా ఉన్నతాధికారుల పోస్టుల సంఖ్యను పెంచనున్నామన్నారు. రాష్ట్రం మొత్తాన్ని 19 జల వనరుల ప్రాదేశిక ప్రాంతాలుగా గుర్తించి, ఒక్కొక్క దానికి ఒక్కో సిఇని పర్యవేక్షణాధికారిగా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు సిఎం కెసిఆర్ వెల్లడించారు. సోమవారం ప్రగతి భవన్‌లో నీటిపారుదలశాఖపై సిఎం కెసిఆర్ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన జలవనరుల శాఖ స్వరూపాన్ని ఖరారు చేశారు. ఇందుకు అనుగుణంగా అదనపు పోస్టులను సంఖ్యను కూడా మంజూ రు చేస్తుననట్లు సమావేశంలో సిఎం తెలిపారు.
ప్రాదేశిక ప్రాంతాలుగా..
రాష్ట్రంలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, రామగుండం, వరంగల్, ములుగు, సంగారెడ్డి, గజ్వేల్, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, హైదరాబాద్, కొత్తగూడెం, ఖమ్మం ప్రాదేశిక ప్రాంతాలుగా ఖరారు చేశారు. వీటికి ఆరుగురు ఇఎన్‌సిలను నియమించి బాధ్యతలు పంచాలని నిర్ణయించనున్నట్లు సిఎం కెసిఆర్ ఈ సమావేశంలో వెల్లడించారు. ప్రదానంగా జనరల్, అడ్మినిస్ట్రేషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగాలకు ప్రత్యేకంగా ఇఎన్‌సిలు ఉంటారని తెలిపారు. ప్రాదేశిక సిఇల స్థానంలో కూడా ముగ్గురు సీనియర్ అధికారులకు ఇఎన్‌సి క్యాడర్ ‌లో బాధ్యతలు అప్పగించారు.

945 అదనపు పోస్టులు మంజూరు

ప్రస్తుతం నీటి పారుదుల శాఖలో ముగ్గురు ఇఎన్‌సిలు ఉండగా, కొత్తగా మరో మూడు ఇఎన్‌సి పోస్టులను మంజూరు చేస్తున్న ట్లు తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఇఎన్‌సిల సంఖ్య ఆరుకు చేరుకుంటుందన్నారు. అలాగే సిఇ పోస్టులను 19 నుండి 22కు, ఎస్‌ఇల పోస్టులు 47 నుండి 57కు, ఇఇల పోస్టులు 206 నుండి 234కు, డిఇఇల పోస్టులు 678 నుంచి 892కు, ఎఇఇల పోస్టులను 2,436 నుండి 2,796కు, టెక్నికల్ ఆఫీసర్ల సంఖ్యను 129 నుండి 199కు, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ల సంఖ్యను 173 నుండి 242కు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ల సంఖ్యను 346 నుండి 398కి, నాన్ టెక్నికల్ పర్సనల్ అసిస్టెంట్ల సంఖ్యను 31 నుండి 45కు, సూపరింటెండెంట్ల సంఖ్యను 187 నుండి 238కు, రికార్డు అసిస్టెంట్ల సంఖ్యను 134 నుండి 205కు పెంచుతున్నట్లు సిఎం కెసిఆర్ తెలిపారు. పునర్వ్యవస్థీకరణ కారణంగా మొత్తం 945 అదనపు పోస్టులు అవసరమవుతాయని అంచనా వేసినట్లు ఆయన పేర్కొన్నారు.

లింకులను త్వరితగతిన పూర్తి
రాష్ట్రంలో అత్యంత ప్రాథాన్యతా అంశంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టామని సిఎం కెసిఆర్ వెల్లడించారు. ప్రధాన ప్రాజెక్టుల్లో భాగంగానే కొద్దిపాటి లింకులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా సంబంధిత అధికారులను సిఎం ఆదేశించారు. అనంతరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టులపై జిల్లా శాసనసభ్యులతో సిఎం కెసిఆర్ సమీక్షించారు. ఛనాక-కొరాట ప్రాజెక్టు బ్యారేజీ, పంప్ హౌస్, కెనాళ్లను 2021 జూన్ లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చెన్నూరు లిఫ్టు ఇరిగేషన్ స్కీంతోపాటు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మధ్యతరహా ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించి, మిగిలి పోయిన పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. జల వనరులశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ తో పాటు ఉన్నతాధికారులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి పరిస్థితిని సమీక్షించాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని సిఎం కోరారు. ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల పరిధిలో ఆయకట్టును అభివృద్ధి చేయడానికి ప్రాణహిత ప్రాజెక్టుపై అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఆదిలాబాద్ జిల్లాలో కుప్పి ప్రాజెక్టు, మహబూబ్ నగర్ జిల్లాలో గట్టు ప్రాజెక్టు, జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని నాగమడుగు ఎత్తిపోతల పథకం టెండర్లను వెంటనే పిలిచి, పనులు చేపట్టాలను కూడా చేపట్టాలని అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. వరంగల్ జిల్లాలో గోదావరి కరకట్టల పనులను వచ్చే వానాకాలంలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని కోనారెడ్డి చెరువుకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పరకాల నియోజకవర్గం పరిధిలోని కోనాయమాకుల ఎత్తిపోతల పథకంలో మిగిలిపోయిన పనులను తక్షణం పూర్తి చేయాలన్నా రు. అచ్చంపేట ఎత్తిపోతల పథకం చేపట్టాలని, దీనికోసం వెంటనే సర్వే నిర్వహించాలని సిఎం ఆదేశించారు. హుజూర్ నగర్ ఎత్తి పోతల పథకాన్ని మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

చెరువులకు మరమ్మత్తులు
ఇటీవల కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న అన్ని చెరువులకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రులు సి.లక్ష్మారెడ్డి , జోగు రామన్న, ప్రభుత్వ విప్ లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, శాసనసభ్యులు కోనేరు కోనప్ప, రేఖా నాయక్, ఆత్రం సక్కు, హన్మంత్ షిండే, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్ధికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ కార్యదర్శి రజత్ కుమార్, ఇఎన్‌సిలు లు సి.మురళీధర్, బి.నాగేంద్రరావు, హరిరామ్, సిఇ వి.రమేశ్, సిఎం ఒఎస్‌డి శ్రీధర్ దేశ్ పాండే, సలహాదారు కె.పెంటారెడ్డి, డిప్యూటీ ఇఎన్‌సి న్సీ ఎం.అనిత, డిడిఎ కె.ఆర్.చందర్ రావు, ఎస్‌ఇ ఎస్.భీమ్ ప్రసాద్, డిడిఎం సాజిద్, కె.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News