Wednesday, April 24, 2024

స్పీడ్ పెంచండి

- Advertisement -
- Advertisement -

CM KCR Review Meeting over Coronavirus

కాళేశ్వం నుంచి మూడు టిఎంసిల నీటిని త్వరగా తరలించాలి
సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీ పనులను త్వరితగతిన పూర్తి అవ్వాలి
ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సమీకరణలే వేగం పెరగాలి
సంబంధిత అధికారులను ఆదేశించిన సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : నిధుల సమీకరణకు సంబంధించిన ప్రక్రియను వెంటనే పూర్తి చేసి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూడో టిఎంసిని తరలించే పనులతో పాటు, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు-వాటికి నిధుల సమీకరణ అంశంపై సిఎం కెసిఆర్ మంగళవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, సిఎం కార్యదర్శి స్మిత సభర్వాల్, ఇఎన్‌సి మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, నీటి లభ్యత కలిగిన సమయంలో ప్రతి రోజు గోదావరి నుంచి 4 టిఎంసిలు, కృష్ణా నుంచి 3 టిఎంసిల నీటిని తరలించాలన్నారు. రాష్ట్రంలోని కోటి 25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి ప్రాజెక్టులను నిర్మిస్తున్నామన్నారు. బడ్జెట్ నిధులతో పాటు వివిధ సంస్థల నుంచి నిధులను సేకరిస్తున్నామన్నారు. ఇప్పటికే దాదాపు అన్ని ప్రాజెక్టులకు సంబంధించి వివిధ సంస్థలతో ఆర్థిక సహాయానికి సంబంధించి ఒప్పందాలు పూర్తయ్యాయని సిఎం తెలిపారు. ప్రభుత్వం తరుపున కట్టాల్సిన వాటాను చెల్లించి, వెంటనే నిధుల సమీకరణ ప్రాసెస్ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ఆదేశించారు. వర్షాకాలం పూర్తి కాగానే అన్ని ప్రాజెక్టుల పనులు వేగవంతం కావాలన్నారు.

CM KCR Review Meeting on Irrigation Projects

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News