Friday, April 26, 2024

మెట్రోను ఆదుకుంటాం

- Advertisement -
- Advertisement -

CM KCR review meeting with metro officials in Pragathi bhavan

పూర్వవైభవ పునరుద్ధరణ చర్యలపై
అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు
కమిటీలో మంత్రి కెటిఆర్, రాజీవ్‌శర్మ,
సోమేశ్‌కుమార్ తదితరులు
సమీక్ష సమావేశంలో సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ప్రయాణాలు తగ్గడం వల్ల హైదరాబాద్ మెట్రో ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయిన నేపథ్యంలో మెట్రో ను ఆదుకునేందుకు ఉన్న అవకాశాలను అన్వేషిస్తామని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. మెట్రోను ఆదుకునేందు కు తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. మెట్రోకు పూర్వవైభవాన్ని తీసుకురాగలమో అవగాహన కోసం ఒక అత్యు న్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సిఎం ప్రకటించారు. ఆర్థికంగా నష్టపోతున్న తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎల్ అండ్ టి కంపెనీ ఉన్నతాధికారులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో, కరోనా కష్టాలను అధిగమించి మెట్రో తిరిగి గాడి లో పడేలా ప్రభుత్వం సహకరిస్తుందని ఎల్ అండ్ టి ఉన్నతాధి కారులకు సిఎం హామినిచ్చారు. తమను ఆర్థిక కష్టాలనుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆధుకోవాలని కోరుతూ మంగళవారం నాడు ప్రగతి భవన్‌లో ఎల్ అండ్ టి ఉన్నతాధికారులు సిఎం కెసిఆర్ తో భేటి అయ్యారు.

కరోనా కాలంలో మెట్రో ఎదుర్కోంటున్న ఆర్థిక నష్టాలను, బ్యాంకు అప్పులు, రోజురోజుకు పేరుకుపోతున్న వడ్డీల వివరాలను సమావేశంలో చర్చించి తమను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడు తూ అనతి కాలంలోనే సురక్షిత ప్రజా రవాణా వ్యవస్థగా హైదరాబాద్ మెట్రో సేవలందిస్తూ ప్రజాధరణ పొందిందన్నారు. కరోనా పరిస్థితులు అన్ని రంగాలను ప్రభావితం చేసినట్లే మెట్రోను కూడా ఇబ్బందుల్లోకి నెట్టిందన్నారు. దినాదినాభివృధ్ది చెందుతున్న హైదరాబాద్ నగరానికి మెట్రో సేవలు ఎంతో అవసరమని, భవిష్యత్తులో మెట్రో మరింతగా విస్తరించాల్సి వుందన్నారు. కరోనా దెబ్బతో మెట్రో అప్పుల్లో కూరుకుపోవడం, వడ్డీలకు వడ్డీలు కట్టాల్సి రావడం శోచనీయమన్నారు. అన్ని రంగాలను ఆదుకున్నట్లే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రోను కూడా గాడిలో పెట్టడానికి తమవంతు కృషి చేస్తుందన్నారు. ఎటువంటి విధానాలు అవలంభించడం ద్వారా మెట్రోకు మేలు చేయగలుగుతామో విశ్లేషిస్తామని తెలిపారు.

సాధ్యాసాధ్యాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశా రు. ప్రజావసరాల దృష్ట్యౌ కరోనా వంటి క్లిష్ట సందర్భాల్లో వినూత్నంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి వస్తుందన్నారు. హైదరాబాద్ మెట్రోను ఆదుకోవడంతో పాటు తిరిగి పుంజుకుని ప్రజావసరాల దృష్ట్యా మరింతగా విస్తరించే దిశగా చర్యలు చేపడతామని సిఎం తెలిపారు. ఇందుకు గాను విసృతంగా చర్చించి పుర్వాపరాలను పరిశీలించి తగు విధానం అవలంభించడం ద్వారా మెట్రోను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ హామి ఇచ్చారు. ఈ కమిటీలో మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు, రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఎంఎయుడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఉంటారని సిఎం తెలిపారు.

మెట్రోను నష్టాలనుంచి రాష్ట్ర ప్రభుత్వం తనవంతు బాధ్యతగా ఆదుకునే అంశంపై అన్ని రకాలుగా పరిశీలించి అధ్యయనం చేసి అతి త్వరలో నివేదిక అందించాలని సిఎం ఆదేశించారు. ఈ సమావేశంలో… హోంశాఖ మంత్రి మహమూద్ అలి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ రావు, ఎంఎ అండ్ యుడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణా రావు, మెట్రో అధికారులు ఎల్ అండ్ టి సీఈఓ అండ్ ఎండి సుబ్రహ్మణ్యం, ఎన్వీఎస్ రెడ్డి, సంస్థ డైరక్టర్ డికె సెన్, ప్రాజెక్టుల సీఈఓ అజిత్, హైదరాబాద్ మెట్రో సీఈఓ కెవిబి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News