Thursday, March 28, 2024

తెలంగాణకు భారీ వర్ష సూచన.. సిఎం కెసిఆర్ సమీక్ష..

- Advertisement -
- Advertisement -

ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన కారణంగా తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో భారీ సూచనపై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన కారణంగా తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. మఖ్యంగా రాష్ట్రంలోని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో సిఎస్ సోమేష్ కుమార్ ఐదు జిల్లాల కలెక్టర్లు, ఎస్పిలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశాలు జారీ చేశారు.

CM KCR Review on Heavy Rains in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News