Home Default నిరుద్యోగులకు శుభవార్త..!!

నిరుద్యోగులకు శుభవార్త..!!

kcr

త్వరలో విద్యుత్ శాఖలో 17వేల ఖాళీల భర్తీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ విద్యుత్ శాఖ ఉద్యోగులపై వరాల జల్లులు కురింపించారు. గురువారం ప్రగతి భవన్ లో విద్యుత్ ఉద్యోగులతో సమావేశమయ్యారు. విద్యుత్ శాఖలో 24వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను త్వరలోనే క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చారు. కొత్తగా 17వేల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే పదోన్నతుల ప్రక్రియను జూన్ వరకు పూర్తి చేస్తామని అన్నారు. వ్యవసాయానికి 24గంటలు విద్యుత్ అందించే విధంగా ఉద్యోగులు కృషి చేయాలని సిఎం సూచించారు.