Home ఖమ్మం తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలి: కెసిఆర్

తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలి: కెసిఆర్

KCR,-SHOBHAఖమ్మం: శ్రీరామ నవమి సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం భద్రాచలం రామాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ… తెలుగు రాష్ట్రాలు అనేక విషయాల్లో పరస్పరం సహకరించుకుని ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలని సిఎం అన్నారు. అన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్‌కు సాధ్యమైనంత వరకు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఆలంపూర్ నుంచి భద్రాచలం వరకు ఎపి, తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్నాయని కెసిఆర్ తెలిపారు. ఖమ్మంలోని దుమ్ముగూడెం ప్రాజెక్టు కిందికి వెళ్లిన నీరు తెలంగాణ వాడుకోవడానికి వీళ్లేదని…. ఆ నీటిని ఆంధ్రా ప్రాంతమే వాడుకుంటుందన్నారు. దుమ్ముగూడెం వద్ద ఎపికి సహకరిస్తామని తాను శాసనసభ సాక్షిగా హామీ ఇచ్చినట్లు కెసిఆర్ గుర్తుచేశారు. తెలంగాణ 1000 టిఎంసిలు వాడుకున్నా ఆంధ్రాకు మరో 1500 టిఎంసిలు ఉంటాయన్నారు. నీటి విషయంలో సమస్యలు రాకుండా పరస్పరం సహకరించుకోవాలని సిఎం చంద్రబాబు చేసిన ప్రతిపానను తాను అంగీకరించినట్లు కెసిఆర్ తెలిపారు.