Home రాష్ట్ర వార్తలు సాగునీటి ప్రాజెక్టులను సాగదీయొద్దు

సాగునీటి ప్రాజెక్టులను సాగదీయొద్దు

kcrయుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి : ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ / హైదరాబాద్: “నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణమంటే ఎనిమిది, పదేళ్ళ పాటు సాగే పని మాదిరిగా అలవాటయ్యింది. అలా కాకుండా రాష్టంలో సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. ప్రాజెక్టులను నేను నిరంతరం పర్యవేక్షిస్తాను. ప్రాజెక్టులపై ప్రతీ సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలి. ప్రతీ రోజు పనుల పురోగతిని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలుసుకుంటూ ఉండాలి”
అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. పాలమూరు ఎత్తిపోత ల పథకంపై సిఎం క్యాంప్ కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు, జి ల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, డాక్టర్ సి.లకా్ష్మరెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వి.శ్రీనివాస్ గౌడ్, ఆలం వెంకటేశ్వ ర్లు, మర్రి జనార్దన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ, సిఎం ముఖ్య కార్యదర్శి ఎస్.నరసింగరావు, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవి, నీటి పారుదల శాఖ ఇఎన్‌సి మురళీధర్, పాలమూరు ప్రాజెక్టు ఆఫీసర్ ఆన్ డ్యూటీ(ఓఎస్‌డి) రంగారెడ్డి, నీటి పారుదల శాఖ ఓఎస్‌డి శ్రీధర్ దేశ్‌పాండే, రిటైర్డ్ ఇంజినీర్ పెంటారెడ్డి, సిఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజె క్టుల పరిస్థితి గురించి ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నీటి పారుదల ప్రాజెక్టులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని, ఈ శాఖకు బడ్జెట్‌లో నిధులను కేటాయించిన తరువాతనే మిగి లిన శాఖల గురించి ఆలోచిస్తామని చెప్పారు. ప్రతి ఏటా రూ.25 వేల కోట్ల ను నీటి పారుదల శాఖకు అందజేస్తామని, ప్రాజెక్టులకు ఎప్పటికప్పుడు బిల్లు లు చెల్లిస్తామని ఆయన వెల్లడించారు. అధికారులు కూడా ఏమాత్రం అల సత్వం చూపకుండా పనిచేయాలని, డిజైన్ల రూపకల్పనలు, ఇతర పనుల్లో అవసరమైతే రిటైర్డ్ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. నీటి పారుదల ప్రాజెక్టులకు అవసరమయ్యే విద్యుత్ సరఫరా చే యడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను జెన్‌కో, ట్రాన్స్‌కో చేస్తున్నదని, వారి తో సమన్వయం చేసుకోవాలని నీటి పారుదల శాఖను సిఎం ఆదేశించారు. ప్రాజెక్టులకు సంబంధించి వివిధ రకాల సర్వేలు నిర్వహించాల్సి ఉన్నందున ఎక్కువ ఏజెన్సీలను నియమించి సర్వేలు త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సిఎం సూచించారు.

రెండేళ్ళలో ‘పాలమూరు ఎత్తిపోతల’ను పూర్తి చేయాలి
పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును రెండేళ్ళలో పూర్తి చేసి వలసల జిల్లాగా పే రున్న మహబూబ్‌నగర్ జిల్లాకు నీరందించాలని, తద్వారా జిల్లాను పసిడి పంటలు పండే సస్యశ్యామల ప్రాంతంగా మార్చాలని ముఖ్యమంత్రి చంద్ర శేఖర్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పనులను వెం టనే ప్రారంభించాలని, పంప్ హౌస్, కాల్వలు, రిజర్వాయర్లు, టన్నెళ్ల ప నులన్నీ సమాంతరంగా జరగాలని ఆయన చెప్పారు. పాలమూరు ఎత్తిపో తల పథకం ద్వారా నార్లాపూర్, ఏదుల, పట్టెం, కర్వెన, ఉద్దండాపూర్, హేమ సముద్రంలో రిజర్వాయర్లు కట్టాలని ఆయన అన్నారు. రెండు వారాల్లో స ర్వే పనులు పూర్తి కావాలని, వెంటనే డిజైన్లు రూపొందించడంతో పాటు టెం డర్లు పిలవాలన్నారు. టెండర్ ప్రక్రియను రెండు వారాల్లోపే ముగించి పను లు ప్రారంభించాలని ఆదేశించారు. పాలమూరు పథకం కోసం జరిగే భూ సేకరణను త్వరగా ముగించేలా జిల్లాకు చెందిన మంత్రులు జూపల్లి కృష్ణా రావు, డాక్టర్ సి.లకా్ష్మరెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్‌రెడ్డి, ఎ మ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. రైతుల భూములు, ఇం డ్లు, ఇతర స్థిరాస్తులకు విలువ కట్టి వెంటనే పరిహారం చెల్లించాలని జిల్లా కలె క్టర్ శ్రీదేవిని ముఖ్యమంత్రి ఆదేశించారు.

రంగారెడ్డి జిల్లాకు విస్తరించాలి
పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును రంగారెడ్డి జిల్లా వరకు విస్తరించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. రంగారెడ్డి జిల్లాకు కూడా నీరం దించే విషయంలో తగిన ప్రణాళికను రూపొందించాలని ఆయన అన్నారు. సరైన కార్యాచరణను రూపొందించుకుని పనులు చేసుకుంటూ పోవాలని సిఎం అధికారులను ఆదేశించారు.