Home తాజా వార్తలు సమైక్య రాష్ట్రంలో అంతా సర్వనాశనమైంది: కెసిఆర్

సమైక్య రాష్ట్రంలో అంతా సర్వనాశనమైంది: కెసిఆర్

CM KCR Speech

 

వికారాబాద్: వికారాబాద్ కా హవా లాకోం మరీజోం కా దవా అని నానుడి ఉండేదని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. సోమవారం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బహిరంగ సభలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. వికారాబాద్ ప్రాంతం తెలంగాణకే ఊటీలాంటి ప్రదేశం అని… అనంతగిరి కొండ మీద ఔషధ మొక్కల సువాసన వచ్చేదని, సమైక్య రాష్ట్రంలో అంతా సర్వనాశనమైదని చెప్పారు. ఎన్నికల్లో గెలవాల్సింది నాయకులు కాదు.. ప్రజలు గెలవాలని, ప్రజాస్వామ్యంలో నిజమైన పరిణతి ఉంటే ప్రజల అభీష్టం గెలవాలని అన్నారు.

దేశంలో ఎక్కడా లేని సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. వికారాబాద్ జిల్లా కావాలనే డిమాండ్ ఉన్నా ఎవరూ చేయలేదని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వికారాబాద్ జిల్లా అయిందన్నారు. పాలమూరు ఎత్తిపోతల నుంచి లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ ద్వారా వికారాబాద్ జిల్లాకు సాగునీరు ఇస్తామన్నారు. త్వరలో చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షా శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇక ఆంధ్ర ప్రజలు మంచివారేనని, వారితో మాకు ఎలాంటి పంచాయతీ లేదన్నారు. కొందరు రాజకీయ నాయకులతోనే తమకు గొడవ అని కెసిఆర్ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు తాము అడ్డుపడలేదని, తెలంగాణకి అన్యాయం జరుగుతుందంటేనే తాము మద్దతివ్వలేదన్నారు. పోలవరం కట్టడానికి తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని తేల్చి చెప్పారు. ఎపికి ప్రత్యేక హోదా అంశంపై తమ పూర్తి మద్దతు, సహకారం ఉంటుందని సిఎం కెసిఆర్ మరోసారి స్పష్టం చేశారు.

CM KCR Speach at Vikarabad public meeting