Home తాజా వార్తలు వాసాలమర్రి సర్పంచ్ అంజయ్యకు సిఎం కెసిఆర్ ఫోన్

వాసాలమర్రి సర్పంచ్ అంజయ్యకు సిఎం కెసిఆర్ ఫోన్

CM KCR Speaks with Vasalamarri Sarpanch Anjaiah

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామ సర్పంచ్ కు ఫోన్ చేశారు. స‌ర్పంచ్ అంజ‌య్య‌తో ఫోన్‌లో మాట్లాడిన సిఎం ఈ నెల 22న వాసాలమర్రి పర్యటనకు వస్తున్నట్టు చెప్పారు. ఊరంతా సామూహిక భోజనం చేద్దామని సర్పంచ్ కి కెసిఆర్ తెలిపారు. అనంతరం గ్రామసభ ఏర్పాటు చేసుకుని సమస్యలపై చర్చిద్దామన్నారు. సామూహిక భోజన ప్రదేశం, గ్రామసభ నిర్వహణకు పెద్ద ఖాళీ స్థలాన్ని చూడాలని సర్పంచ్ కు సూచించారు. వాసాల‌మ‌ర్రి గ్రామాన్ని సిఎం కెసిఆర్ ద‌త్త‌త తీసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఎమ్మెల్యే సునీత, కలెక్టర్ పమేలా సత్పతి గ్రామంలోని ఏర్పాట్లను పరిశీలించారు.

CM KCR Speaks with Vasalamarri Sarpanch Anjaiah