Thursday, April 25, 2024

కేంద్రం విధానాల వ‌ల్ల రైతాంగం దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పంజాబ్‌లో ధాన్యం కొనుగోలు చేసిన‌ట్టే తెలంగాణ‌లో ధాన్యం కొనుగోలు చేయాల‌ని కేంద్రానికి చేతులెత్తి దండం పెట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. గురువారం ఉదయం వరిధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నగరంలోని ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ లో టిఆర్ఎస్ పార్టీ మహాధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి కెసిఆర్ తోపాటు మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, టిఆర్ఎస్ నాయకులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ.. కేంద్రం విధానాల వ‌ల్ల మ‌న రైతాంగం దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది. ధ‌ర్మంగా, న్యాయంగా వ్య‌వ‌సాయం చేసి దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. కేంద్ర, రైతు నిరంకుశ చ‌ట్టాల‌ను విర‌మించుకోవాల‌ని, క‌రెంటు మీట‌ర్లు పెట్టే విధానాన్ని మార్చుకోవాల‌ని అనేక‌సార్లు చెప్పాం. రైతుల ప్ర‌యోజ‌నాలు ప‌రిర‌క్షించ‌ుకోవాడినికి, ఉత్త‌ర భార‌త‌దేశంలోని రైతుల పోరాట‌ల‌ను క‌లుపుకొని భ‌విష్య‌త్‌లో యుద్ధం చేయాల్సి ఉంటుంది.

కేంద్రానికి మ‌న రైతుల గోస‌ల‌ను, బాధ‌లను విన్న‌వించాం. నిన్న స్వ‌యంగా ప్ర‌ధాని మోడీకి లేఖ రాశాను. కానీ కేంద్రం నుంచి స్పంద‌న లేదు. మ‌న బాధ ప్ర‌పంచానికి, దేశానికి తెలియాల‌ని చెప్పి ఈ ధ‌ర్నాకు శ్రీకారం చుట్టాం. ఇది ఆరంభం మాత్ర‌మే. అంతం కాదు. రానున్న రోజుల్లో గ్రామాల్లో కూడా ప్రజల హక్కు కాపాడేందుకు వివిధ రూపాల్లో పోరాటాల‌ను ఎంచుకుని ముందుకు కొన‌సాగుతూనే ఉంటాం. కేంద్రం దిగివ‌చ్చి మ‌న రైతాంగానికి న్యాయం చేసే వ‌ర‌కు పోరాటం కొన‌సాగిస్తాం అని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. కాగా, మధ్యాహ్నం 2 గంటల తర్వాత గవర్నర్ తిమిళిసై సౌందరరాజన్ ను కలిసి వినతిపత్రం అందజేయనున్నారు.

 CM KCR Speech at TRS Maha Dharna

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News