Thursday, April 25, 2024

26న దళితబంధు తొలి అవగాహన సదస్సు

- Advertisement -
- Advertisement -

CM KCR to chair awareness meeting on Dalita Bandhu

ఉదయం 11 నంచి సాయంత్రం వరకు కార్యక్రమం
హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క గ్రామం నుంచి ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళల వంతున ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి నలుగురు చొప్పున మొత్తం 412 మంది దళితులకు ఆహ్వానం
వారితో పాటు పాల్గొననున్న 15మంది రిసోర్స్ పర్సన్స్
దళితబంధు ముఖ్య ఉద్దేశం, అమలు, పర్యవేక్షణ, నిర్వహణపై కల్పించనున్న అవగాహన

మన తెలంగాణ/హైదరాబాద్: హుజూరాబాద్ నియోజక వర్గంలో పైల ట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానున్న ‘తెలంగాణ దళిత బంధు’ పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ, విజయం సాధించే దిశగా తీసుకోవాల్సిన కార్యాచరణపై మొట్టమొదటి అవగాహన సదస్సును ఈ నెల 26వ తేదీన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరుగనున్నది. ఉదయం 11 గంటలకు ప్రారంభమై సాయంత్రం దాకా జ రగనున్న ఈ సమావేశంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని గ్రామానికి న లుగురు చొప్పున (ఇద్దరు పురుషులు ఇ ద్దరు మహిళలు) , ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి నలుగురు చొ ప్పున (ఇద్దరు పురుషులు ఇద్దరు మహిళలు) మొత్తం 412 మంది దళిత పురుషులు మహిళలు పాల్గొంటారు. వారితో పాటు 15 మంది రిసోర్సు పర్సన్స్ పా ల్గొంటారు. మొత్తం 427 మంది హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళితులు ఈ అవగాహన సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సు గురించి సిఎం కెసిఆర్ వివరిస్తూ ఈ నెల 26న హుజూరాబాద్ నియోజకవర్గం పరిథిలోని గ్రామాల నుంచి వారి వారి మండల కేంద్రాలకు ఉదయం 7 గంటలకు చేరుకుంటారన్నారు.

మండల కేంద్రంలో అల్పాహార కార్యక్రమం ముగించుకుని అక్కడ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో హుజూరాబాద్ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి హైదరాబాద్‌కు మొత్తం 427 మంది పలు బస్సుల్లో బయలు దేరుతారు. ఉదయం 11 గంటల కల్లా హైదరాబాద్ ప్రగతి భవన్‌కు చేరుకుంటారని సిఎం తెలిపారు. ప్రగతి భవన్‌లో జరిగే ఈ సదస్సులో దళిత బంధు పథకం ముఖ్య ఉద్దేశ్యం, పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ తో పాటు పథకాన్ని విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల మీద సిఎం కెసిఆర్ వారికి అవగాహన కల్పిస్తారు. పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ లో ప్రారంభం కానున్న దళితబంధు పథకం, రాష్ట్రంలోని దళితులందరి జీవితాల్లో గుణాత్మక మార్పుకు ఏవిధంగా దోహదపడుతుందో సిఎం వివరించారు. పైలట్ ప్రాజెక్టును హుజూరాబాద్ లో చేపట్టిన నేపథ్యంలో చారిత్రాత్మక పథకంలో ఆ ప్రాంత బిడ్డలుగా ఎట్లా లీనమై పనిచేయాలి? దళితుల సామాజిక ఆర్థిక గౌరవాన్ని ఉన్నత శిఖరాల్లో నిలబెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న తెలంగాణ దళిత బంధు పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు ఏమిటి ? తన మానస పుత్రికయిన ఈ పథకాన్ని ఎట్లా దళితుల్లోకి తీసుకపోవాలి? వారి జీవితాలను వారే అభివృద్ధి చేసుకునే దిశగా ఎట్లా వారికి అవగాహన కల్పించాలి ? అధికారులతో ఎలా సమన్వయం చేసుకోవాలె, కలిసి పోవాలె ? అనే తదితర అంశాలను ఇంటరాక్షన్ సెషన్ లో హాజరైన వారికి సిఎం కెసిఆర్ వివరించి అవగాహన కల్పిస్తారు. మధ్యాహ్నం లంచ్ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత కొనసాగిన అవగాహన సదస్సు సాయంత్రానికి ముగుస్తుంది.

CM KCR to chair awareness meeting on Dalita Bandhu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News