Saturday, April 20, 2024

20న సిద్దిపేటకు సిఎం పర్యటన

- Advertisement -
- Advertisement -

20న సిఎం కెసిఆర్ సిద్ధిపేట జిల్లా పర్యటన
సమీకృత కలెక్టరేట్, పోలీసు కమిషనరేట్ కార్యాలయం ప్రారంభం

మన తెలంగాణ/హైదరాబాద్/వరంగల్ బ్యూరో: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఈ నెల 20వ తేదీన సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, పోలీసు కమిషనరేట్ కార్యాలయాన్ని ఆ యన ప్రారంభిస్తారు. అలాగే సిద్దిపేట ఎంఎల్‌ఎ క్యాంపు కా ర్యాలయాన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ మేరకు జిల్లా అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని మంత్రి హరీష్‌రావు తో పాటు ఇతర ఉన్నతాధికారులు రోజు సమీక్షిస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖ  కార్యాలయాన్ని ఒకే భవన సముదాయంలో సమీకృత కార్యాలయాన్ని నిర్మించారు. సుమారు రూ. 81 కోట్లతో దుద్దెడ వద్ద అధునాతన హంగులతో నిర్మించిన జి ప్లస్ టు (G+2) జిల్లా సమీకృత సముదాయంతో పాటు, సిద్ధిపేట శివారులో 29 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన (G+2) పోలీసు కమిషనరేట్ భవనాన్ని సిఎం ప్రారంభిస్తారు.
వరంగల్ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి 21న సిఎం శంకుస్థాపన
వరంగల్ సెంట్రల్ జైలు స్థానంలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి ఈనెల 21న ముఖ్యమంత్రి కెసిఆర్ చేతులమీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరాల శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన శాఖామంత్రి సత్యవతిరాథోడ్‌లు అన్నారు. బుధవారం వరంగల్ సెంట్రల్ జైలు స్థలాన్ని మంత్రుల బృందం సందర్శించింది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌తో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, రాజ్యసభసభ్యులు బండా ప్రకాష్, ఎంఎల్‌ఎ నన్నపునేని నరేందర్‌లు ఉన్నారు. ఈసందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. వరంగల్‌లో మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్షంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఎనలేని ప్రాధాన్యతను ఇస్తున్నారన్నారు. ఈనెల 21న వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో సిఎం కెసిఆర్ పర్యటన ఉందన్నారు. ముందుగా వరంగల్ అర్బన్ కలెక్టరేట్ సమీకృత భవన సముదాయాన్ని ప్రారంభిస్తారన్నారు. ఆతరువాత 24 అంతస్తులతో నిర్మించిన మల్టీ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్షంతోనే మల్టీ సూపర్‌స్పెసాలిటీ ఆస్పత్రిని టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. ప్రతిపక్షాలు ఎన్నోరకాలుగా అనుకున్నప్పటికి ప్రభుత్వం అనుకున్న లక్షం మేరకు పనిచేసుకుంటూ పోతుందన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా ఉండేవిధంగా తాము కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగరమేయర్ గుండు సుధారాణి, ఇంజనీరింగ్ అధికారులు గణపతిరెడ్డి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్‌జోషి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

CM KCR to Visit Siddipet on June 20

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News