Home తాజా వార్తలు నదినే తరలిస్తున్నాం

నదినే తరలిస్తున్నాం

ఈ జులై నుంచే రెండు టిఎంసిల గోదావరి నీరు మళ్లింపు
ఇది గొప్ప శుభపరిణామం, 45లక్షల ఎకరాలకు నీరందించే కాళేశ్వరం అతి వేగంగా పూర్తవుతున్నందుకు సంతోషంగా ఉంది
ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో, ఆపరేషన్, మెయింటెనెన్స్ కూడా అంతే ముఖ్యం : కన్నెపల్లి, మేడిగడ్డ పరిశీలన
అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: గోదావరి నది నుండి రోజుకు 3 టీ ఎం సిల నీటిని తరలించడం అంటే తెలంగాణ ప్రాం తానికి ఒక నదినే తరలిస్తున్నట్లుగా భావించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పేర్కొన్నారు. వచ్చే జూలై నుంచే 2 టిఎంసిల నీటిని మళ్లించడం శుభపరిణామమని అన్నారు. 45 లక్షల ఎకరాలకు సాగు నీరందించే అతి పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ ను వేగవంతంగా పూర్తి చేస్తున్నందుకు సంతోషం గా ఉందని సీఎం కెసిఆర్ అన్నారు. కాళేశ్వ రం ప్రాజెక్ట్ పనుల పరిశీలనలో భాగంగా ఆదివారం ఉదయం కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కీలకమైన కన్నెపల్లి పంప్ హౌజ్ పనులను పరిశీలించారు. పంపుహౌస్ లోనికి లిఫ్ట్ ద్వారా దిగి మోటార్ల పంపింగ్ పనితీరు గురించి ఇంజనీర్లను, కాంట్రాక్ట్ ఏ జెన్సీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం ఎంత ముఖ్యమో, ప్రాజెక్ట్ ఆపరేషన్ అండ్ మె యింటనెన్స్ కూడా అంతే ముఖ్యమని సీఎం అన్నారు. ఇంత పెద్ద సాగు నీటి ప్రాజెక్ట్ కాబట్టి చిన్న చిన్న సమస్యలు వస్తాయని, వాటిని పకడ్బందీగా పరిష్కరించి ప్రాజెక్ట్ నిర్వహణకు భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం అధికారులకు, వర్కింగ్ ఏజెన్సీలకు సూచించారు.
నాణ్యతలో రాజీ పడొద్దు..
గడువులోగా పనులు జరగాలనే తొందరలో ప్రాజెక్టు నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడవద్దని అధికారులకు, కాంట్రా క్టు ఏజెన్సీలకు సూచించారు. కొద్ది సమయం తీసుకున్నా, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరా మోటార్ల బిగింపు సహా, మొత్తం అన్ని విభాగాల్లో చెక్ లిస్టు పూర్తి అయిన తర్వాత ట్రయల్ రన్ ప్రారంభానికి తాను, సిఎస్ కలిసి ట్రయల్ రన్ ప్రారంభానికి వస్తామని సిఎం తెలిపారు. జూన్ చివరి వరకు ఈ ప్రక్రియలన్నీ పూర్తిచేయాలని ఆదేశించారు. మేడిగడ్డ నుంచి మిడ్ మానేరు తొలి దశ, మిడ్ మానేరు తర్వాత రెండో దశగా ఫేస్-1గా, మిడ్ మానెర్ నుండి ఫేస్ 2 గా పరిగణించి ప్రాజెక్ట్ పూర్తికి యాక్షన్ ప్లాన్ ప్రకారం పనులు చేయాలని ఆదేశించారు. పంప్‌హౌజ్‌లు సహా ఇతర ప్రాజెక్ట్ ఆపరేషన్ విషయంలో ఇండిపెండెంట్ వైర్ లెస్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సిఎం సూచించారు. ప్రాజెక్ట్‌లో పెద్ద పెద్ద మోటార్లు ఏర్పాటు చేస్తున్నందున అన్ని పంప్‌హౌజ్‌ల వద్ద మోటార్లకు అందే నీటిలోకి కలప చెట్లు వంటివి వెళ్లకుండా ముందుగానే జాలి తరహాలో ఉండే ట్రాష్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రాజెక్ట్ పనులలో భాగంగా ముందు రెండు టీఎంసిల నీటిని ఎత్తిపోసే పనులను యుద్ధప్రాతిపదిక న పూర్తి చేస్తూ మూడో టీఎంసి నీటిని ఎత్తి పోసే పనులను కొనసాగించాలని అన్నారు.


మేడిగడ్డ పనుల్లో వేగం పెంచండి
కన్నెపల్లి పంపుహౌజ్ నిర్మాణ పనుల పరిశీలన తర్వాత సిఎం కెసిఆర్ హెలిక్యాప్టర్‌లో మేడిగడ్డ బ్యారేజి నిర్మాణ ప్రాంతానికి వెళ్లారు. వ్యూ పాయింట్ వద్ద పనుల పురోగతిని పరిశీలించా రు. మరింత త్వరగా పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టు ఏజెన్సీలు, అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ మురళీధర్ రావు కాళేశ్వరం ప్రాజెక్ట్ enc వెంకటేశ్వ ర్లు వర్క్ ఏజెన్సీ, ఎల్ అండ్ టీ బాధ్యులకు., పని త్వరిత గతిన పూర్తి చేసేందుకు అవసరమైన వెల్డర్లు, ఫిట్టర్లు, తదితర సిబ్బందిని దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి, పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఇందుకు సహకరించాలని మెగా ఎండి కృష్ణారెడ్డిని సిఎం కోరారు. గేటు గేటుకూ సరిపో ను సిబ్బందిని దించి మూడు షిఫ్ట్‌లల్లో పనిచేయించాలన్నా రు. అక్కడనుంచి వాహనంలో బ్యారేజ్ మీద నుంచి ప్రయాణి స్తూ, సిఎం కెసిఆర్ మధ్యలో ఆగి, గేట్ల బిగింపు పనులను పరిశీలించారు. గోదావరి నది ఈ కొస నుంచి అవతలి కొసకు(మహారాష్ట్ర సరిహద్దు వైపుకు) చేరుకుని అక్కడ కాసేపు ఆగి వాగు మళ్లింపు కాల్వ నిర్మాణం, మిగిలిన కొన్ని గేట్‌ల బిగిం పుకు సంబంధించి సూచనలిచ్చారు. అక్కడ నుంచి 45డిగ్రీల ఎండలోనే వాహనంలో బయలుదేరిన ముఖ్యమంత్రి గోదావరి నీటి కోతను తట్టుకునేందుకు అంచులకు నిర్మిస్తున్న కరకట్టల నిర్మాణ పనులను పరిశీలించారు. అక్కడ నుంచి తిరి గి బయలుదేరి బ్యారేజ్ కింది కాఫర్ డ్యామ్ మీదుగా గుంతల రోడ్డు ను సైతం లెక్కచేయకుండా ప్రయాణించారు. ఎండలోనే ఆగి, వాహనం దిగి, అక్కడ పనిచేస్తున్న కార్మికులను కెసిఆర్ పలకరించారు. అక్కడ కూడా ఇంజినీర్లకు పలు సూచనలు చేశారు. తర్వాత నేరుగా గెస్ట్‌హౌజ్ చేరుకున్న సీఎం కెసిఆర్, కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులు, ఇంజనీర్లు, అధికారులతో సమావేశమయ్యారు. రానున్న జూన్ లో వచ్చే గోదావరి వరదను మేడిగడ్డ వద్ద నిలువరించేందుకు చేపట్టవలసిన సత్వర చర్యలపై పలు సూచనలు చేశారు.
కార్మికులకు కృతజ్ఞతలు
కాళేశ్వరం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయడానికి కృషి చేస్తున్న ఇంజనీరింగ్ అధికారులను, వర్కింగ్ ఏజెన్సీలతో పాటు ప్రతి ఒక్క కార్మికుడికి ముఖ్యమంత్రి కెసిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. నడి ఎండలో సుడిగాలి పర్యవేక్షణ చేసిన సీఎం కెసిఆర్ వెంట మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్, రాజ్య సభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్ రావు, భాను ప్రకాశ్, ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణా రెడ్డి, కోరుకంటి చందర్, చీఫ్ సెక్రటరీ ఎస్ కే జోషి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ, చీఫ్ సెక్రటరీ ఎస్.కె జోషి, కరీం నగర్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్‌లు మురళీధర్ రావ్, వెంకటేశ్వర్లు, మెగా కంపెనీ డైరెక్టర్లు కృష్ణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.

CM KCR visited Kaleshwaram Irrigation project