Home తాజా వార్తలు మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సిఎం కెసిఆర్

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సిఎం కెసిఆర్

 

CM-KCRసికింద్రాబాద్‌: లష్కర్‌ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని తెలంగాణ ముఖ్యమంత్రి కెెసిఆర్‌ ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టువస్ర్తాలు, బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆలయ అర్చకులు సిఎంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి దర్శనం కోసం ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు.

CM KCR Visited Ujjaini Mahankali Temple