Home తాజా వార్తలు అమ్మవారికి బోనం సమర్పించుకున్న సిఎం కెసిఆర్, మాజీ ఎంపి కవిత

అమ్మవారికి బోనం సమర్పించుకున్న సిఎం కెసిఆర్, మాజీ ఎంపి కవిత

CM KCR

సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ ఎంపి కవిత

మహంకాళి బోనాల సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర పోలీస్ కమిషనర్ అంజని కుమార్ స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న సిఎం కెసిఆర్ పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ నిర్వాహకులు సిఎంను ఘనంగా సన్మానించారు.

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలపండుగ సందర్భంగా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకకా అనాది నుంచి జరుపుకుంటున్న బోనాల పండుగ సందర్భం గా కవిత బోనమెత్తారు. ఆదివారం ఉదయం కల్వకుంట్ల కవిత స్థానిక టిఆర్‌ఎస్ మహిళా నాయకులు, జాగృతి సభ్యులతో కలిసి సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా కవితకు స్వగతం పలుకుతూ పోతరాజుల నృత్యప్రదర్శనలు, శివసత్తుల పూనకాలతో ఆలయ పరిసరాలు అమ్మవారి నామస్మరణతో మారు మోగాయి. వందలాధి మహిళలతో కలిసి బోనాల జాతరలో పాల్గొన్నకవితకు ఆలయమర్యాదలతో ఆహ్వానించి ప్రత్యేకపూజలు చేశారు.
జగన్మాత కరుణా కటాక్షాలు ఉండాలి
జగన్మాత కరుణా కటాక్షాలు మనందరిపై నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని నిజామాబాద్ మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు సందర్భంగా నేడు మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించినట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అందరికీ బోనాలు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

CM KCR Visits Ujjaini Mahankali Temple Secunderabad