Thursday, April 25, 2024

నేడు నల్లగొండకు సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR vists Nallagonda today

హెలిప్యాడ్ పరిశీలించిన జిల్లా ఎస్‌పి రెమా రాజేశ్వరి

మనతెలంగాణ/నల్లగొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం జిల్లా కేంద్రానికి రానున్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ తండ్రి మారయ్య దశదినఖర్మకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ మేరకు వేదిక వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా ఎమ్మెల్యే గాదరి కిషోర్ తండ్రి దశదిన కర్మలో పాల్గోనేందుకు, జిల్లాకు వచ్చేందుకు ముహూర్తం కుదిరింది. బుధవారం, రోజున, హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ మార్గం ద్వారా బయలుదేరి నల్లగొండ జిల్లాలోని నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో హెలిప్యాడ్ వద్ద వస్తారు. అక్కడ జిల్లా యంత్రాంగం ద్వారా నేరుగా ఎమ్మెల్యే కిషోర్ తండ్రి దశదిన కర్మ లో పాల్గొని వారి నివాళులర్పించి అక్కడి నుంచి బయలుదేరి, హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకుంటారు.జిల్లాకేంద్రంలోని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఇంటి వద్ద జరిగే ఆయన తండ్రి దశదినకర్మకు రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తుండడంతో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లతో పాటు, హెలిప్యాడ్, భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలిసి పరిశీలించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News