Friday, March 29, 2024

పాకిస్థాన్‌కు సిఎం కెసిఆర్ గట్టి వార్నింగ్..

- Advertisement -
- Advertisement -

CM-KCR

హైదరాబాద్: పాకిస్థాన్‌కు ముఖ్యమంత్రి కెసిఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశాన్ని పిడికెడంత దేశంగా అభివర్ణించారు. పిచ్చిపిచ్చిగా వ్యవహిస్తే చూస్తూ ఊరుకోమని సిఎం హెచ్చరించారు. శనివారం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో టిఆర్ఎస్ ఘన విజయం సాధించిన సందర్భంగా సిఎం కెసిఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ కుట్రలు పన్నినంత కాలం ఆ దేశాన్ని శత్రుదేశంగానే చూస్తామన్నారు. మన భారతదేశ అంతర్గత వ్యవహారాలలో పాకిస్థాన్ జోక్యాన్ని ఎట్టి పరిస్తితుల్లో సహించేది లేదని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ వ్యవహారంలో కేంద్రం తీసుకునే నిర్ణయాలను దేశ సమగ్రత కోసం ఎప్పుడు సమర్ధిస్తామన్నారు. ఇందులో భాగంగానే జమ్మూ, కాశ్మీర్‌లోని ఆర్టికల్ 370ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు టిఆర్‌ఎస్ సంపూర్ణ మద్దుతు ఇచ్చిందన్న విషయాన్ని సిఎం కెసిఆర్ గుర్తు చేశారు. అయితే నూతన పౌరసత్వ సవరణ చట్టం దేశ సమగ్రతకు విఘాతం కలగించే విధంగా ఉండడం వల్ల వ్యతిరేకిస్తున్నామన్నారు.

CM KCR Warning to Pakistan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News