Home నాగర్ కర్నూల్ మరో కోనసీమగా.. పాలమూరు

మరో కోనసీమగా.. పాలమూరు

CM KCR who is pleased with the benefits

కృష్ణా జలాలతో రైతుల పాదాలు తడపడమే ప్రభుత్వ లక్షం
ఆసాధ్యాలను సుసాధ్యం చేస్తున్న సీఎం కేసీఆర్
తెలంగాణాను కోటి ఎకరాల మాగాణిగా మార్చడమే లక్షం
బల్మూర్, మన్ననూర్, ఆలేరులలో రిజర్వాయర్‌ల నిర్మాణం
రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

మన తెలంగాణ/అచ్చంపేట/అమ్రాబాద్:  ఉద్యమ నాయకుడిగా తన ప్రస్తానాన్ని ప్రారంభించి, రాదన్న తెలంగాణను తన పట్టుదలతో సాధించి, అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తూ అసాధ్యాన్ని సుసాద్యం చేస్తూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు  ఆదర్శవంతంగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నాడని  రాష్ట్ర భారీ నీటి పారుదల,  శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం అమ్రాబాద్ మండలం మాదవానిపల్లిలో కోటి 50 లక్షలతో నిర్మించిన33/11 కేవీ సబ్ స్టేషన్‌ను, అమ్రాబాద్ మండల కేంద్రంలో మూడు కోట్లతో నిర్మించిన గోదాములు, స్త్రీ శక్తి భవనాలను మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు.  అనంతరం అమ్రాబాద్ జూనియర్ కళాశాల మైదనాంలో ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ ఆధ్వర్యంలో భహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ  పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ప్రతి రైతు పొలానికి నీరు చేర వేసినప్పుడే బంగారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని అన్నారు.  రాష్ట్రంలోని పేదల బ్రతులకు ఆసర ఫెన్షన్లు, కేసీఆర్ కిట్, రైతు బందు, రైతుబీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముభారక్‌ల వంటి ఎన్నో కార్యక్రమాలతో పేద ప్రజల బ్రతుకులకు  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భరోస కల్పించాడన్నారు. సముద్ర మట్టానికి 620 మీటర్ల ఎత్తులో ఉన్న అమ్రాబాద్ పదర మండలాలకు సాగు నీరందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. డిండి ప్రాజెక్టు ద్వారా అమ్రాబాద్, పదర మండలాలలో 25వేల ఎకరాకలు సాగు నీరందించనున్నట్లు తెలిపారు. అమ్రాబాద్ పదర మండలాలతో పాటు అచ్చంపేట నియోజక వర్గంలోని వివిద గ్రామాలకు 75 వేల ఎకరాలకు నీరందించేందుకు కృషి చేస్తున్నమాన్నారు. డిండి ప్రాజెక్టుకు నీరందించేందుకు ఎల్లూరు నుండి నార్లాపూర్ వరకు 8 కిలో మీటర్లమేర గ్రావిటీ ద్వారా నీటిని తరలించి , అక్కడినుండి 22 కిలో మీటర్ల ద్వారా సోరంగ మార్గంద్వారా ఆలేరు వరకు నీటిని తీసుకువచ్చి ఆలేరులో మూడు టీఎంసీల రిజర్వాయర్‌ను నిర్మించడం జరుగుతుందన్నారు. అక్కడి నుండి ఎత్తి పోతల ద్వారా బల్మూర్‌కు నీటిని తరలించి బల్మూర్ వద్ద రెండున్నర టీఎంసీల రిజార్వాయర్ నిర్మాణం బల్మూర్ వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి మన్ననూర్‌లో 1.06 టీఎంసీల రిజర్వాయర్‌ను ఏర్పాటు చేసి అమ్రాబాద్ , పదర మండాలకు నీరందించేందుకు ప్రణాళిక పూర్తయ్యిందన్నారు. 620 మీటర్ల ఎత్తులో ఉన్న అమ్రాబాద్ , పదర మండలాలకు నీరందించేందుకు కోట్ల రూపాయాలు వెచ్చించి వ్యాప్కో సంస్థ ద్వారా సర్వే చేయించడం జరిగిందన్నారు. పాలమూరు రంగారెడ్డి, భీమ, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల ద్వారా పాలమూరు ఉమ్మడి జిల్లాలో ఆరులక్షల యాభై వేల ఎకరాలకు సాగు నీరందించడం జరిగిందన్నారు. ఈఏడాది మరో లక్ష యాభై వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను కోటి ఎకరాల మాగానిగా మార్చడమే సీఎం కేసీఆర్ లక్షమన్నారు. అమ్రాబాద్‌లో నూతన మార్కెట్ యార్డును ఏర్పాటు చేసి ప్రత్యేక పాలక మండలిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.దీంతో పాటు చారగొండలో సబ్ మార్కెట్ యార్డును ఏర్పాటు చేస్తామన్నారు. రూ. 5 కోట్లతో మానవడ్డు వాగుపై ఆనకట్ట నిర్మించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజల భూములకు సాగు నీరందించేందుకు ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మానం చేపడుతుంటే చూసి ఓర్వలేని కాంగ్రేస్ నేతలు కోర్టులకు వెల్లి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. న్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి తీరుతామన్నారు. అచ్చంపేట నియోజక వర్గానికి లక్ష యాభై వేల ఎకరాలకు నీరందించి తీరుతామన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ మాట్లాడుతూ గత పాలకులు ఈప్రాంతాన్ని అన్ని రంగాలలో బ్రష్టు పట్టించారన్నారు. ఈప్రాంతంలోనే పుట్టి పెరిగామని భీరాలు పలికే కాంగ్రేస్ నేతలు ఈప్రాంతానికి ఏమి ఒరగ బెట్టారని ప్రశ్నించారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే విదంగా కాంగ్రేస్ పార్టీ పరిస్థితి తయారయ్యిందన్నారు. తాను బ్రతికి ఉన్నంత కాలం అచ్చంపేట ప్రజలకు సేవ చేస్తానన్నారు. మంత్రి హరీష్ రావు పాదం ఎక్కడ మోపిన ఆప్రాంతం సుభీక్షమవుతుందన్నారు. ఈప్రాంతంలో పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు అనుమతులు ఇవ్వడంతో పాటు రైతు బందు ఫథకం వర్తింప చేసే విదంగా కృషి చేయాలన్నారు. భహిరంగ సభలో మంద జగన్నాథ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, రైతు సమన్వయ సమితీ జిల్లా అద్యక్షులు మనోహర్ తదితరులు ప్రసంగించారు. మంత్రి హరీష్ రావుకు మన్ననూర్‌లో టీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. భహిరంగ సభలో మంత్రికి రైతులు నాగలిని, గొల్లకురుమలు గొర్రెపిల్లను భహూకరించారు. ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ సతీమణి గువ్వల అమల మొక్కలను మంత్రికి భహూకరించారు. , ఈకార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాములు, ఎమ్మల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, రైతు సమన్వయ సమితీ జిల్లా అద్యక్షుడు మనోహర్, మున్సిపల్ ఛైర్మెన్ తులసీరాం, మార్కెట్ ఛైర్ పర్సన్, జయంతి, టీఆర్‌ఎస్ నేతలు చెన్న కేశవులు, నర్సింహ్మ గౌడ్, సీఎం రెడ్డి, రాంబాబునాయక్ , విష్ణు మూర్తి. లాయర్ శ్రీనువాసులు, రాజారాంగౌడ్, తిరుమలయ్య, తదితరులు పాల్గొన్నారు.