Home తాజా వార్తలు సిఎం పర్యటన సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశాం

సిఎం పర్యటన సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశాం

CM KCR will be tour the Gajwel constituency

 

500 మంది విధుల్లో ఉన్నారు
పోలీస్ కమిషనర్ డి.జోయల్ డేవిస్

హైదరాబాద్: సిఎం పర్యటన సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు పోలీస్ కమిషనర్ డి.జోయల్ డేవిస్ (ఐపిఎస్) తెలిపారు. రేపు ఉదయం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో పలువురు అధికారులు బందోబస్తులో భాగంగా విధులు నిర్వహిస్తున్నారని, ఎప్పటికప్పుడు వారు అప్రమత్తంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. సిఎం పర్యటన సందర్భంగా పోలీసు కమిషనర్ డి. జోయల్ డేవిస్, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుతో కలిసి సిఎం పర్యటించే ప్రాంతాలను సోమవారం పరిశీలించారు.

బందోబస్తులో పాల్గొనే అధికారుల వివరాలు ఇలా….
అడిషనల్ ఎస్పీలు/03, ఏసిపిలు, డీఎస్పీలు/05, సిఐలు, ఇన్‌స్పెక్టర్లు/20, ఎస్‌ఐలు/ 37 మంది, పోలీస్ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది, బిడి టీమ్స్, రోప్ పార్టీస్, స్పెషల్ పార్టీలతో అధికారులు, సిబ్బంది మొత్తం కలిపి 500 మందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.

సిఎం పర్యటన వివరాలు ఇలా…
సిఎం కెసిఆర్ ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్టు ఆయన తెలిపారు. ఉదయం 10.30 గంటలకు వర్గల్ మండలం హౌసులపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్ నుంచి హల్దీ కాలువ లోకి గోదావరి జలాల విడుదల చేయను న్నారు. అనంతరం ఉదయం 11.15 గంటలకు మర్కుక్ మండలం పాముల పర్తి గ్రామంలో గోదావరి జలాలను గజ్వేల్ కాలువలోకి సిఎం కెసిఆర్ గోదావరి జలాల విడుదల చేయనున్నారు.

CM KCR will be tour the Gajwel constituency