Friday, March 29, 2024

దేశ రాజకీయాల్లో కెసిఆర్ కీలక పాత్ర

- Advertisement -
- Advertisement -

CM KCR will key role in National politics

మనతెలంగాణ/ హైదరాబాద్ : జాతీయ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక పాత్ర పోషిస్తారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి ఆయన దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి, పట్టువస్త్రాలతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తారని, జాతీయ రాజకీయాల్లో కెసిఆర్ ప్రభంజనం సృష్టించడం ఖాయమని వినోద్‌కుమార్ పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. పలు పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. దేశ రాజకీయాల్లో కెసిఆర్ కీలక పాత్ర ఉండాలని స్వామి వారిని ప్రార్థించానన్నారు. చాలాకాలం తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కొవిడ్ కారణంగా రెండేళ్లుగా స్వామి వారిని దర్శించుకోలేక పోయానన్నారు. ప్రపంచంలో చాలా దేశాలను నేను సందర్శించానని, అయితే టిటిడి శుభ్రత కలిగిన దేవస్థానం గొప్పగా ఉందని ఆయన కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యే సందర్భంలో కెసిఆర్ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారని, కానుకలు సమర్పించారని వినోద్‌కుమార్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News