Home తాజా వార్తలు కలెక్టర్లతో భేటీ కానున్న సిఎం కెసిఆర్

కలెక్టర్లతో భేటీ కానున్న సిఎం కెసిఆర్

KCRహైదరాబాద్: ఇవాళ కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై జిల్లా కలెక్టర్ల సమావేశం జరగనుంది. సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు సిఎం కెసిఆర్ కలెక్టర్లతో భేటీ కానున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో జిల్లా స్థాయి ప్రభుత్వ శాఖల పునర్ వ్యవస్థీకరణ కూడా ప్రజలకు ఎక్కువగా మేలు చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని సిఎం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీచేశారు.