Home జాతీయ వార్తలు మమత మోఢీ కాదు, భేటీ

మమత మోఢీ కాదు, భేటీ

CM Mamata Banerjee

 

బంగ్లాగా పశ్చిమ బెంగాల్ పేరు మార్చండి

ప్రధానితో సిఎం మమతా బెనర్జీ చర్చలు
భారీ బొగ్గుగని ప్రారంభోత్సవానికి ఆహ్వానం

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ గత రెండేళ్లలో మొదటి సారి ప్రధాని నరేంద్రమోడీని బుధవారం కలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రపంచం లోనే రెండవ భారీ బొగ్గు గనిని ప్రారంభించడానికి ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానించారు. అంతేకాకుండా రాష్ట్రం పేరును బంగ్లాగా మార్చడానికి రాష్ట్రం చేసిన విజ్ఞప్తిని అనుమతించాలని కోరారు. పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భమ్ జిల్లాలో డియోచా పచ్చమి బొగ్గు గనికి ప్రారంభోత్సవం చేయడానికి ప్రధానిని ఆహ్వానించినట్టు ఆమె పాత్రికేయులతో చెప్పారు. ఈ బొగ్గు గని వల్ల లక్ష ఉద్యోగాలు లభిస్తాయని, అంతేకాక రూ.12000 కోట్ల వరకు పెట్టుబడులు లభిస్తాయని బెనర్జీ వివరించారు. దేశంలోని రాష్ట్రాల అక్షర క్రమంలో మొదటి వరుసలో ఉండేలా బంగ్లాగా పశ్చిమబెంగాల్ పేరు మార్చాలని కోరినట్టు చెప్పారు. 2011,2016 ల్లో కూడా ఇదే విధంగా రాష్ట్రం పేరు మార్చడానికి అభ్యర్థనలు పంపినా కేంద్రం వాటిని పక్కన పెట్టింది. అయితే ఈ సమావేశంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని, ఇది ప్రభుత్వంతో మరో ప్రభుత్వం సమావేశం కావడమే తప్ప మరేం కాదని బెనర్జీ వివరించారు.

CM Mamata Banerjee talks with PM Modi