Home తాజా వార్తలు మహా నిర్మాణాలపై భేటీ

మహా నిర్మాణాలపై భేటీ

page-1*వంతెనలు, టన్నెళ్లు, టవర్ల నిర్మాణానికి ముందుకు వచ్చిన చైనా కంపెనీలు
*హుస్సేన్‌సాగర్ టవర్ ఖర్చులో 85% భరించడానికి బ్యాంక్ ఆఫ్ చైనా సంసిద్ధత
*పెంజర్ల యూనిట్ విస్తరణకు పి అండ్ జి ప్రతిపాదన
మన తెలంగాణ / హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టే వంతెనలు, టన్నెళ్లు, బహుళ అంతస్థుల భవన నిర్మాణాల్లో పెట్టుబడు లు పెట్టేందుకు చైనా దేశానికి చెందిన పలు కంపె నీలు ముందుకొచ్చాయి. క్యాంపు కార్యాలయం లో శుక్రవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ను చైనా కంపెనీల ప్రతినిధులు కలిసి, వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు చైనాకు వెళ్లిస సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉన్న రంగాలపై పరస్పర అవగాహన కుదిరింది. ఈ నేపథ్యంలో చైనా కంపెనీల ప్రతినిధులు నీటి పారుదల శాఖ చేపట్టే ప్రాజెక్టుల ప్రతిపాదిత స్థలా న్ని, టన్నెళ్లు తవ్వాల్సిన ప్రాంతాలను, మూసీ నది పై నిర్మించతలపెట్టిన బ్రిడ్జ్ ప్రాంతాన్ని, హుస్సేన్ సాగర్ ఒడ్డున నిర్మించే అతిపెద్ద టవర్ భవనాలను ప్రతిపాదిత స్థలాన్ని సందర్శించారు. వీటికి సంబంధించిన మోడళ్లు, ప్రతిపాదనలు తయారు చేశారు. వాటిని ముఖ్యమంత్రికి సూచిం చారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించే టన్నెళ్లను తక్కువ సమయంలో, అత్యంత నా ణ్యతతో పూర్తి చేస్తామని చైనా ప్రతి నిధులు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు చెప్పారు. మూసీ నదిపై నిర్మించే బ్రిడ్జ్‌కి సంబంధించి కూడా చర్చలు జరి గాయి. హైదరాబాద్ నగరంలో దుర్గం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జ్ కట్టడానికి సిసిసిసి హైవే కన్సల్టెన్సీ కంపెనీ ముందుకొచ్చింది. హుస్సేన్ సాగర్ ఒడ్డున భారతదేశంలోనే అతిపెద్ద టవర్ నిర్మించేందుకు అయ్యే వ్యయంలో 85 శాతం భరించడానికి బ్యాంక్ ఆఫ్ చైనా సంసిద్ధత వ్యక్తం చేసింది. త్వరలోనే మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. చైనా ప్రతి నిధి బృందంతో మనదేశంలోని బ్యాంక్ ఆఫ్ చైనా విభాగం అధిపతి హెంగ్ చాంగ్, అంజు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ యోగేశ్ వా, ఇండియా హెడ్ మనోజ్ గాంధీ, సిసిసిసి మేనేజర్ పెంగ్ యస్ గాంగ్, బిజినెస్ మేనేజర్ చాం గ్ చుస్ యుమాస్, బీజింగ్ జడ్‌వైటిఎక్స్ బిజినెస్ మేనేజర్ వు హావ్ , రాడిక్ కన్సల్టెన్సీకి చెందిన జహీర్ అహ్మద్, రాజ్ కుమార్ తదతరులు ఉన్నారు. ఇం కా ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ సీనియర్ అధికారులు నర్సింగ రావ్, చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ, టిఎస్ ఐపాస్ ఛేజింగ్ సెల్ అధికారిణి శాంతికుమారి, ఇండస్ట్రీస్ సెక్రటరీ అరవింద్ కుమార్,టిఎస్‌ఐఐసి ఎండి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా ప్రొక్టర్ అండ్ గ్యాంబెల్ ఇండియా ప్రతినిధులు కూడా సిఎం కెసిఆ ర్‌తో శుక్రవారం నాడు భేటీ అయ్యారు. క్యాంపు కార్యాలయంలో సిఎం కెసి ఆర్‌తో ఆ సంస్థ ఎండి ఎఐ. రజ్వానీ ప్రభృతులు సిఎంను కలిశారు. మహ బూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో ప్రస్తుతం ఉన్న 171 ఎకరాల తమ యూనిట్‌ను విస్తరించే ప్రతిపాదన ఉందన్నారు. 1200 మందికి ఉపాధి లభించేందుకు ఇది దోహదపడుతుందని వారు సిఎం కెసిఆ ర్‌కు వివరించారు.
పెంజర్ల లోని ప్రస్తుతం ఉన్న యూనిట్‌లో ఇప్పటికే 786 మందికి ఉపాధి కల్పిస్తున్నామని ఆ సంస్థ ఎండి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై సిఎం కెసిఆర్ స్పందిస్తూ తెలంగాణ లో విస్త్రృత అవకా శాలు కల్పిస్తామని, తమ యూనిట్లను విస్తరించేందుకు పూర్తిగా తోడ్పాటు నిస్తామన్నారు. ప్రొక్టర్ అండ్ గ్యాంబెల్ సంస్థ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 80 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తూ 150 దేశాల్లో తమ ఉత్పత్తు లను మార్కెటింగ్ చేస్తోంది. కాగా అంతకు ముందు వీరంతా పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతోనూ భేటి అయ్యారు.
నెదర్లాండ్ అంబాసిడర్ భేటీ
అంతకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను నెదర్లాండ్స్ అంబాసిడర్ అల్‌ఫోన్సస్ స్టీలింగ్‌గా ఆధ్వర్యంలోని బృందం కలిసింది. క్యాంపు కార్యాలయంలో సిఎంను కలిసిన ఈ బృందం తెలంగాణలో వ్యవసాయం, గ్రీన్ హౌస్ కల్టివేషన్, అగ్రికల్చర్ యూనివర్శిటీ , హార్టికల్చర్ యూనివర్సిటీ, ఆరోగ్యం, పర్యాటక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశం సిద్దంగా ఉందని తెలియజేసింది.