Home రాష్ట్ర వార్తలు త్వరప’డిండి’

త్వరప’డిండి’

cmడిండి ప్రాజెక్టు పనులు త్వరితంగా చేపట్టాలని సిఎం ఆదేశం  సచివాలయం సమీక్షల్లో సిఎం బిజీబిజీ 

మన తెలంగాణ / వరంగల్ క్రైం
సారిక, ఆమె ముగ్గురు కుమారుల సజీవదహనం సంఘనటపై పోలీసులు భిన్నకోణాల్లో విచారణ జరుపున్నారు. మృతురాలు సారిక అత్తింటి వేధిం పులు, భర్త అనిల్ రెండవ వివాహం నేపథ్యంలో, తన కుమారుల భవిష్యత్తుపై ఆందోళనతో ఆత్మ హత్యకు పాల్పడి ఉండవచ్చుననే కోణం ముందు కు వచ్చినట్టు తరువాయి 8లో

*త్వరితగతిన కార్యాచరణ రూపొందించండి

*ఎత్తిపోతల పథకంపై సిఎం కెసిఆర్ సమీక్ష

 హైదరాబాద్: డిండి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశిం చారు. నల్లగొండ జిల్లాలోని సింగరాజుపల్లి, గొట్టిముక్కల, కృష్ణరాంపల్లి, శివన్న గూడెం, మహబూబ్‌నగర్ జిల్లాలోని అర్కపల్లిలో రిజర్వాయర్ల నిర్మా ణానికి అవసరమైన భూసేకరణ పనులను ప్రారంభించాలని, ఇందుకు గతం లో కేటాయించిన రూ.75 కోట్లకు అదనంగా మరో రూ.100 కోట్లను విడు దల చేయాలని ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. సిఎం క్యాంప్ కార్యాల యంలో శనివారం ముఖ్యమంత్రి డిండి ఎత్తిపోతల పథ కం పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సిఎంఒ ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, నల్గొండ కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, రిటైర్డ్ చీఫ్ ఇంజి నీర్ శ్యాంప్రసాద్‌రెడ్డి, సిఎంఒ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ తదిత రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిండి ఎత్తిపోతల పథకం పనులు, భూసే కరణ, తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధి కార యంత్రాంగానికి పలు సూచనలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం గా నల్లగొండ జిల్లాలో నిర్మించే గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ల కోసం కూడా భూసేకరణ చేపట్టాలన్నారు. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలైన దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలతో పాటు మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగా రెడ్డి జిల్లాలోని మూడున్నలక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించే ఈ పథ కాన్ని వేగవంతంగా చేపట్టాలన్నారు. రిజర్వాయర్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పనులను మరింత వేగం చేయాలని తెలిపారు. భూ నిర్వాసితు లకు భూమి విలువ, ఆస్తి విలువతో పాటు కొత్తగా ఇల్లు కట్టు కోవడానికి 5 లక్షల 4 వేల రూపాయలను ఒకేసారి చెల్లించాలని సూచించారు. నీటి పారు దల శాఖాధికారులే ఆస్తుల విలువలను అంచనా వేసి, రెవెన్యూ అధికారుల కు అందించాలని చెప్పారు. వీలైనంత తక్కువ ముం పుతో ఎక్కువ గ్రామాలకు నష్టం కలుగకుండా రిజర్వా యర్లు నిర్మించాలని, ఏ రిజర్వాయరుకు ఎంత భూమి సేకరించాలో నిర్ణయించి అంచనాలు రూపొందించాలని ఆయన తెలి పారు. రైతులకు అనుకూలంగా ఉండే విధంగా పరిహారం ఇస్తున్నందున భూసేకరణ చాలా వేగంగా జరగాలన్నారు. పరిహారం అంతా ఒకేసారి అం దించి వెంటనే రిజిస్ట్రేషన్లు చేయించాలని సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట, నల్గొండ జిల్లాలోని దేవరకొండ, మును గోడు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు సాగునీరు అందించడంతో పాటు హైదరాబాద్ నగరానికి మంచినీరు అందిం చే విధంగా ప్రాజెక్ట్ డిజైన్లు ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలలోని ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారని, అలాంటి ప్రాంతాలకు సురక్షిత సాగునీరు అందించడం ద్వారా సమస్యను పరిష్కరిం చాలని చెప్పారు. మొత్తం ప్రాజెక్ట్ దాదాపు 6 కిలోమీటర్ల మేర సొరంగ మార్గం నిర్మించాల్సి ఉన్నందున అందుకు అవసరమైన వ్యూహాన్ని కూడా రూపొందించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు.
బిజీబిజీగా సిఎం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సచివాలయంలో శనివారం సమీక్షలతో బిజీబిజీగా గడిపారు. ముఖ్యమంత్రి 32 రోజుల తర్వాత సచివాలయానికి రావడంతో అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఏ శాఖ కు సంబంధించిన అంశంపై ఎప్పుడు సిఎం నుంచి పిలుపు వస్తుందోనని వివి ధ శాఖల ఉన్నతాధికారులు తమ ఛాంబర్‌లలో తాజా సమాచారంతో వేచి చూశారని తెలిసింది. వరుసగా అమరావతి శంకుస్థాపనకు, ఢిల్లీకి వెళ్ళడం, ఆ తర్వాత వరంగల్ ఉప ఎన్నికల అభ్యర్థి ఎంపిక, వ్యూహరచనలో మునిగి తేలడం, దసరా సెలవులు రావడంతో ఆయన సచివాలయం వైపు రాలేకపో యారు. మధ్య మధ్యలో జిల్లా పర్యటనలకు కూడా వెళ్ళారు. అయినప్పటికీ ఎప్పటికప్పుడు క్యాంపు కార్యాలయం నుంచే సమీక్షలు నిర్వహించారు.