Home మంచిర్యాల గిరిజనులపై సిఎం చిన్నచూపు

గిరిజనులపై సిఎం చిన్నచూపు

cpi

*గొడవలకు అధికారులు కారణమా!
*కెసిఆర్ ఓటమి లక్షంగా ముందుకు
*ఎన్నికల హామీలను విస్మరించిన టిఆర్‌ఎస్
*నిరాశ పర్చిన మూడున్నర సంవత్సరాల పాలన
*సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ గిరిజనులు లంబాడాల  మ ధ్య జరుగుతున్న అల్లర్లను సిఎం కెసిఆర్ ఏ మాత్రం ప ట్టించుకోవడంలేదని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎఫ్‌సిఎ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన జిల్లా స్థా యి ప్రథమ సభలకు ముఖ్యఅతిథిగా హాజరై  ప్రసంగించారు. అన్ని పార్టీలతో కలిపి సమావేశాన్ని ఏర్పాటు చే సి సమస్యను పరిష్కరించాల్సి ఉండగా గత నాలుగు నెలలుగా ఇరువర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణలను  పూర్తిగా పట్టించుకోలేదన్నారు. గొడవలకు అధికారుల ను కారణంగా చూపిస్తూ  వారిపై బదిలీ వేటు వేయడం సమంజసం కాదని, అల్లర్లకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. శాంతియుత వాతావరణానికి కృషి చేయాల్సిన సిఎం  ఇరువర్గాల మధ్య ఘర్షణలు పెంచుతున్నారన్నారు. మూడున్నర సంవత్సరాల టిఆర్‌ఎస్ పాలనలో ప్రజలు విసిగి పోయారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అన్ని రంగా ల్లో వెనుకబడగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో  ఉ న్న వాటిని సద్వినియోగం చేసుకోలేదని, ప్రజలు ఆశించిన తెలంగాణ రాలేదనే, కేవలం ఒకే కుటుంబానికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. సింగరేణి ప్రాంతా ల్లో బొందల గడ్డలు ఉండవన్న కెసిఆర్, కాంగ్రెస్ ప్ర భుత్వం కంటే ఎక్కువగా ఓపెన్ కాస్టులకు అనుమతు లు ఇస్తూ  ఎక్కువ బొందలగడ్డలుగా మారుస్తున్నారన్నా రు. తెలంగాణ ఏర్పాటు తరువాత కాంట్రాక్టు కార్మికు ల పేరే వినిపించదన్న కెసిఆర్ పర్మినెంట్ విషయం మరిచిపోయారన్నారు. ఉద్యోగాల భర్తీచేయకపోవడం వలన నిరుద్యోగ యువకులు ఆకలితో అలమటించే రోజులు ఎదురయ్యాయన్నా రు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోగా ఉద్యమాలు చేసే వారిని టార్గెట్‌గా చేసుకొని ఉద్యమాలకు వీలు లే కుండా ధర్నా చౌక్‌కు ఎత్తివేసి, అడిగే హక్కును కూడా హరింప జేశారన్నారు. తెలంగాణ ప్రాంత వెనుకబాటుకు ప్రజలు అనుభవిస్తున్న క్షోభకు దే శం, రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రె స్ కూడా ముఖ్య కారణమన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే నల్ల ధనం వెలికి తీసి, ప్రజల ఖా తాల్లో జమ చేస్తామని చెప్పి మోడీ ఒక్క పైసా కూడా ప్రజల ఖాతాల్లో జమ చేయలేదన్నారు. నో ట్ల రద్దుతో చిరువ్యాపారులు, రైతులు, అధికంగా బలహీన పడ్డారని జిఎస్‌టి వచ్చాక, సామాన్య ప్ర జలకే తలె త్తుతున్నాయని ఆరోపించారు. బిజెపి మూడున్నర సంవత్సరాల పాలనలో దేశం ఆర్థి కం, సామాజికంగా దెబ్బతిందని, అదేవిధంగా దే శంలో ముస్లీం, క్రిస్టియన్లపై దాడులు పెరిగిపోయాయన్నారు. దేశంలో దుర్మార్గమైన పాలన కొనసాగుతుందని, ప్రభుత్వాన్ని విమర్శించిన వారిని హత్యలు చేస్తున్నారన్నారు. ఈ మహాసభల్లో సిపి ఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.రాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సాయిబాబా, జిల్లా కార్యద ర్శి సత్యనారాయణ, ఆదిలాబాద్, కుమ్రం భీం జి ల్లా కార్యదర్శులు దత్తాత్రి, కె.రాజన్న, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు రాఘవులు, సంకె రవి, ప్రకాష్, కృష్ణామాచారి, నాయకులు అరిగెల మహేష్ తదితరులు పాల్గొన్నారు.