Saturday, June 21, 2025

జూన్ 4న ఢిల్లీకి సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

వాయిదా పడ్డ ఢిల్లీ పర్యటన జూన్ 4వ తేదీన ఫిక్స్ అయ్యింది. జూన్ 4వ తేదీన రావాలని సిఎం రేవంత్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌లకు ఏఐసిసి అగ్రనేతలు సూచించినట్టుగా సమాచారం. అదేరోజు పిసిసి కార్యవర్గ కూర్పుతో పాటు మంత్రివర్గ విస్తరణ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్‌లో మకాం వేసి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, ఎంపిలు,

ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలతో సమావేశమై ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టతకు చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. దీంతోపాటు పార్టీ పదవులు, మంత్రివర్గ విస్తరణలో ఎవరికీ అవకాశం ఇస్తే బాగుంటుందో మీనాక్షి నటరాజన్ నియోజకవర్గాల వారిగా అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మీనాక్షి ఇచ్చే నివేదిక ఆధారంగా పిసిసి కార్యవర్గంతో పాటు మంత్రివర్గ విస్తరణలో కూడా పలువురికి అవకాశాలు వస్తాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే జూన్ 4వ తేదీన ఈ రెండు అంశాలు కొలిక్కి వస్తాయని కాంగ్రెస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News