Home జాతీయ వార్తలు ఢిల్లీ పర్యటనలో యోగి

ఢిల్లీ పర్యటనలో యోగి

CM yogi meets amit shah, to visit pm modi friday

 

న్యూఢిల్లీ: మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేత జితిన్‌ప్రసాద బిజెపిలో చేరారు. ఆయన పార్టీలో చేరిన 24 గంటల్లోనే యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీ పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పనితీరుపై బిజెపిలో అసమ్మతి పెరుగుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీలో పార్టీ పెద్దలను కలుసుకోనుండడం గమనార్హం. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా యోగిఆదిత్యనాథ్ గురువారం మధ్యా హ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆయన శుక్రవారం ప్రధాని మోడీ, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాతో సమావేశం కానున్నారు. అప్నాదళ్ ఎంపి అనుప్రియా పాటిల్ కూడా గురువారం సాయంత్రం అమిత్ షాను కలిశారు.

రాష్ట్ర నాయకత్వంలో మార్పు ఉండవచ్చంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆయన కులమైన ఠాకేర్ల అనుకూల ప్రభుత్వంగా తయారయిందనే విమరర్శలు పార్టీ వర్గాలలోనే గత కొంత కాలం గా వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్రాహ్మణ వర్గానికి చెందిన జితిన్‌ప్రసాద పార్టీలో చేరడంతో రాబో యే అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో ఆయన కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా ఆ అపప్రథను తొలగించవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికలకుముందు యుపిలో నాయకత్వ మా ర్పు ఉండవచ్చన్న వార్తలను బిజెపి గట్టిగా కొట్టిపారేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనే పార్టీని నడిపిస్తారని, అయితే అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో మార్పులు ఉం డవచ్చని పార్టీ వర్గాలు అంటున్నారు.

ఇదిలా ఉండగా ముఖ్య మంత్రి బుధవారం అర్ధరాత్రి లక్నోలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్‌తో సమావేశమయ్యారు. ఇది ప్రతినెలా జరిగే సాధారణ సమావేశమేనని రాష్ట్రప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఈ సమావేశం కోసం సునీల్ బన్సాల్ హుటాహుటిన హెలికాప్టర్‌లో లక్నో చేరున్నారని రాజకీయ వర్గా లు చెబుతున్నాయి. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర నాయకత్వంలో మార్పు గురించి ఇప్పటికే అనేక ఊహాగానాలు వచ్చాయి. అలాగే కొవిడ్ మహమ్మారిని సమర్థవంతంగా కట్టడి చేయడంలో విఫలమైనందుకు యోగి ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యోగి ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

CM yogi adityanath meets amit shah, to visit pm modi friday