Tuesday, March 21, 2023

కేంద్రం గుప్పిట్లోనే బొగ్గు ధరలు!

- Advertisement -

sccl* సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం
* కోలిండియాలో గణనీయంగా తగ్గనున్న కార్మికుల సంఖ్య
* భగ్గుమంటున్న జాతీయ కార్మిక సంఘాలు
* నేడు సింగరేణి వ్యాప్తంగా గనుల వద్ద కార్మికుల నిరసన

మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి   గనుల ప్రైవేటీకరణకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలపడంతో ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి నిర్వీర్యం కానుంది. కేంద్ర ప్రభుత్వం బొగ్గు  గనుల తవ్వకాన్ని ప్రైవేట్ పరం చేసి, వాణిజ్య పరంగా బహిరంగ మార్కెట్‌లో ఇష్టారాజ్యంగా విక్రయించుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం సింగరేణి సంస్థపై ప్రభావం చూపనుంది. కోలిండియాలో ఉత్పత్తి చేసినా దేశంలో ఎక్కడైనా ఏ పరిశ్రమకైనా బొగ్గును విక్రయించేందుకు అవకాశం ఉండడంతో బొగ్గుకు మార్కెట్‌లో తీవ్రమైన పోటీ నెలకొని సింగరేణి సంస్థ మనుగడకు ముప్పు వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. బొగ్గు గనుల తవ్వకాల ప్రైవేటీకరణపై జాతీయ కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. సింగరేణి వ్యాప్తం గా శుక్రవారం అన్ని గనులపై కార్మికులు నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించాలని ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య కార్మికులకు  పిలుపునిచ్చారు. 1996 నాటికి దేశంలో దాదాపు 8 లక్షల మంది కార్మికులు ఉండగా కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ ప్రస్తుతం 3.30 లక్షలకు చేరింది. శాశ్వత ఉద్యోగుల స్థానంలో కాంట్రాక్టు కార్మికులు చేరారు. ఇప్పటికే సింగరేణి సంస్థలోని కొన్ని విభాగాల్లో ప్రైవేటీకరణ జరిగి  కాంట్రాక్టర్లకు పనులు అప్పగించగా వారు కాంట్రాక్టు కార్మికులను నియమించుకొని తక్కువ వేతనాలు ఇస్తూ శ్రమదోపిడికి పాల్పడుతున్నారు. కోలిండియా పరిధిలో ప్రస్తుతం ఉన్నా బొగ్గు గనులను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 1973లో జాతీయం చేయుటకు ముందునుంచి సింగరేణి బొగ్గు గనులు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. 1945లో నిజాం ప్రభువు లండన్ స్టాక్స్ ఎక్సేంజ్‌లో సింగరేణి షేర్లు కొనుగోలు చేయడంలో ఆ సంస్థ తొలి ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు పొందింది. అప్పటికి దేశంలోని బొగ్గు గనులన్నీ ప్రైవేట్ రంగ సంస్థల ఆధీనంలోనే ఉన్నాయి. 1973లో కోలిండియాను జాతీయం చేసిన తరువాత కార్మికులకు ఉద్యోగ భద్రత, రక్షణ లభించగా బొగ్గు ఉత్పత్తి పురోగతి గణనీయంగా జరిగింది. బొగ్గు గనుల ప్రైవేటీకరణతో ప్రభుత్వ రంగ బొగ్గు గనుల పరిస్థితి నిర్వీర్యం కానుండగా బొగ్గు పరిశ్రమ మనుగడకే ప్రమాదకరంగా మారింది.
సింగరేణి వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో నిరసన
దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమల మనుగడకు ముప్పువాటిల్లే విధంగా కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల ప్రైవేటీకరణకు పూనుకోవడం అన్యాయమని ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ శుక్రవారం సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ రంగంలో బొగ్గు గనుల తవ్వకానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలుపడం శోచనీయమని, ఇందిరాగాంధీ హయాంలో దేశంలోని బొగ్గు గనులను జాతీయం చేసిందని, సింగరేణి సంస్థ 1938లో నైజాం సర్కారులోనే ప్రభుత్వ రంగంలోకి వచ్చిందన్నారు. కార్మికులు ప్రైవేటీకరణను అడ్డుకునే విధంగా అధిక సంఖ్యలో పాల్గొని, నిరసనలు తెలుపాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles