Home తాజా వార్తలు నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

Coal production stoped in bhupalpally singareni division

 

భారీ వర్షాలతో 8వేల టన్నుల ఉత్పత్తికి అంతరాయం
రూ. 2 కోట్ల 40లక్షల నష్టం

మన తెలంగాణ/భూపాలపల్లి : భూపాలపల్లి సింగరేణి డివిజన్ పరిధిలోని కేటికే ఒసి2 ప్రాజెక్టు పరిధిలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగింది. ఈ ఉపరితల గనిలో రోజుకు నాలుగు వేల నుంచి 5 వేల టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి బొగ్గు పెల్ల కూడా బయటకు రాలేదు. ఈ బొగ్గుగనిలో ప్రతి రోజు బొగ్గు ఉత్పత్తికి ఉపయోగపడే 12 షావెల్స్ 60 భారీ వాహనాలు నడుస్తుండేవి. విరామం లేకుండా కురుస్తున్న వర్షానికి బొగ్గు ఉత్పత్తికి ఉపయోగించే వాహనాలు పని స్థలాల వద్దకు వెళ్లలేని పరిస్థితులు ఉండడంతో సింగరేణి అధికారులు వాహనాలు దెబ్బతినకుండా పర్యవేక్షణ చేస్తున్నారు.

ఓపెన్‌కాస్ట్ 2 ప్రాజెక్టు అధికారి జాన్ ఆనంద్ పర్యవేక్షణలో గని వద్ద, పని స్థలాల వద్ద నీటి నిల్వలు పేరుకోకుండా భారీ మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపిస్తున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రెండు రోజులకు సుమారు రూ.10వేల టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వాటిల్లగా సింగరేణి అధికారుల అంచనా ప్రకారం టన్ను బొగ్గుకు మూడు వేల నుంచి రూ.5వేలు వరకు ధర పలుకుతుంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు పరిధిలో రూ. 2కోట్ల 50 లక్షల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగినట్లు అంచనా వేశారు.

Coal production stoped in bhupalpally singareni division