Home తాజా వార్తలు పిల్లల కోసం పోరాడిన శునకం…

పిల్లల కోసం పోరాడిన శునకం…

Snake-Biteహైదరాబాద్ : నగరంలోని నాగోల్ లో నాగుపాము కలకలం సృష్టించింది. కుక్కపిల్లలను పాము కాటువేసింది. దీంతో రెండు కుక్కపిల్లలు మృతి చెందాయి. ఈ ఘటన నాగోల్ ఆర్టీఏ కార్యాలయం సమీపంలో చోటుచేసుకుంది. అయితే కొన్ని రోజులుగా అక్కడ కుక్కపిల్లలు తిరుగుతున్నాయి. కాగా, నాగుపాము కాటేస్తున్న సమయంలో చూసిన కుక్క తన పిల్లల్ని కాపాడడానికి గట్టిగా అరుస్తూ.. దాన్ని బెదరగొట్టే ప్రయత్నం చేసింది. పిల్లలపై తల్లికి ఉండే ప్రేమ మాటల్లో చెప్పలేనిది. అయితే తల్లిప్రేమ మనుషుల్లోనే కాదు.. జంతువుల్లోనూ  గొప్పగా ఉంటుందని చెప్పడానికి ఈ వీడియో నిదర్శనం. తన బిడ్డలను కాటేయడానికి వచ్చిన పామును కుక్క ధైర్యంగా ఎదుర్కొన్న తీరు అందరినీ కట్టిపడేస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ మారింది. తల్లి కుక్క మాతృప్రేమకు నెటిజన్లు సెల్యూట్ కొడుతున్నారు.

video courtesy by 10tv

Cobra bite puppies in Nagole RTA Office at hyderabad