Thursday, April 25, 2024

త్రైమాసికంలో కోఫోర్జ్ 7 శాతం వృద్ధి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: వచ్చే ఏడాది నాటికి బిలియన్ డాలర్ ప్లస్ సంస్థగా రూపుదిద్దుకునేలా ప్రోడక్ట్ ఇంజనీరింగ్, క్లౌడ్, డేటా, ఆటోమేషన్, ఇంటిగ్రేషన్‌ల్లో పెట్టుబడులు పెట్టడాన్ని కొనసాగిస్తున్నామని కో ఫోర్జ్ సిఇఒ సుధీర్‌సింగ్ తెలిపారు.మంగళవారం హైదరాబాద్‌లో అగ్రగామి అంతర్జాతీయ ఐటి సొల్యూషన్స్ సంస్థ కోఫోర్జ్ లిమిటెడ్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోఫోర్జ్‌కు ఈ ఏడాది ముఖ్యమైందన్నారు.ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సంస్థ ఆదాయం ఏడు శాతం వృద్ధి సాధించిందన్నారు. కరెన్సీ స్థిర బదిలీ రేటులో సవరించిన వడ్డీలు, పన్నులు, సంపద తరుగుదల (ఈబిఐటిడిఎ) సూచికలో 18.7 శాతం వృద్ధి చెందిందన్నారు. గతేడాదితో పోలిస్తే ఆదాయాలను కనీసం 35 శాతం సర్దుబాటు చేసిన ఈబిఐటిడిఎను కనీసం 40 శాతం వృద్ధి చేసుకునే వీలుందన్నారు. కంపెనీ ఆదాయంలో వృద్ధిని నివేదించింది.ఈబిఐటిడిఎ మార్జిన్‌లో గణనీయ విస్తరణను కనబర్చిందన్నారు.సిబ్బంది సంఖ్యను అధికం చేసుకోవడంతో పాటు మూడు భారీ డీల్స్‌ను సొంతం చేసుకుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News