Thursday, April 18, 2024

చల్లబడ్డ తెలంగాణ.. పలుచోట్ల వర్షం

- Advertisement -
- Advertisement -

charminar

హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. శుక్రవారం రాత్రి నుంచి రాష్ట్రంలోని పలుచోట్ల వర్షం కురుస్తోంది. పశ్చిమ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు, తెలంగాణ మీదగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. మరఠ్వాడ, తెలంగాణ మీదగా 0.9కిలీ మీటర్ల ఎత్తున ఈ ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షం పడుతుంది. రాగల ఐదు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. మహదేవపూర్, కాళేశ్వరం, మహాముత్తారం మండలాల్లో భారీగా వర్షం కురుస్తోంది.

Cold temperatures in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News