Thursday, April 25, 2024

పడిపోతున్న ఉష్ణోగ్రతలు

- Advertisement -
- Advertisement -

Cold wave hits in Telangana

పలు జిల్లాలో 10 డిగ్రీల కన్నా తక్కువే…
హైదరాబాద్‌కు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్
చలి గాలులు గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి
హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక

హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే తక్కువగా నమోదు కావడంతో చలితీవ్రత అధికమయ్యింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోనూ చలి ఎక్కువకావడంతో ఎల్లో అలర్ట్‌ను వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. శీతలగాలులు అధికంగా వీస్తుండడంతో నగరంలో చలిగాలులు అధికంగా వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువగా నమోదవుతు న్నాయని, ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో 5 రోజుల పాటు సాధారణ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతకు పడిపోతాయని వాతావరణ శాఖ హైదరాబాద్ విభాగం అధికారులు తెలిపారు. అందులో భాగంగా హైదరాబాద్‌లో ఈ నెల 19వ తేదీ వరకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేయగా, ఈ నెల 20, 21వ తేదీల్లో ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఉష్ణోగ్రతలు పడిపోయే సమయంలో చలి గాలులు గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

భారత వాతావరణ విభాగం కేటాయించే అలర్ట్‌ల వివరాలు ఇలా…

గ్రీన్ అలర్ట్ (ఆల్ ఈజ్ వెల్) ఎటువంటి అడ్వైయిజరీ ల్లేవు.
ఎల్లో అలర్ట్ ( బీ అవేర్) కనిష్ట ఉష్ణోగ్రతలు 11- నుంచి 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు.
ఆరెంజ్ అలర్ట్ ( బీ ప్రిపేర్డ్) కనిష్ట ఉష్ణోగ్రతలు 5 నుంచి -10 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు.
రెడ్ అలర్ట్ ( టేక్ యాక్షన్) కనిష్ట ఉష్ణోగ్రతలు నాలుగు డిగ్రీలు అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News