Home వార్తలు యుఎస్‌లో కలెక్షన్ క్వీన్

యుఎస్‌లో కలెక్షన్ క్వీన్

samantaటాలీవుడ్‌లో హీరోలు సృష్టించే రికార్డుల గురించి ఏ రేంజ్‌లో మాట్లాడుకుంటారో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆ రేంజ్‌లో హీరోయిన్‌లు సృష్టించే రికార్డుల గురించి మాత్రం ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ స్టార్ హీరోయిన్ సమంత క్రియేట్ చేస్తున్న రికార్డుల గురించి మాత్రం ఇప్పుడు చెప్పుకొని తీరాల్సిందే. అంతలా సమంత ఏం మాయ చేసిందంటే… యుఎస్‌లో కలెక్షన్ క్వీన్‌గా మారిపోవడమే. అక్కడ మిలియన్ డాలర్ల క్లబ్ అంటూ హీరోల స్టార్‌డమ్‌ను అంచనా వేస్తుంటే… ఆ అంచనాలకు అందకుండా సమంత తన మిలియన్ డాలర్ల సినిమాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు 26 సినిమాల్లో సమంత నటిస్తే… అందులో 11 సినిమాలు మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ప్రవేశించడం చూస్తుంటే అక్కడ సమంత రికార్డు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఇక ఈ ఏడాది విషయానికొస్తే… సమంత మిలియన్ డాలర్ల రికార్డు హై రేంజ్‌లో ఉంది. ముందుగా కోలీవుడ్ స్టార్స్ విజయ్‌తో ‘తేరి’, సూర్యతో ‘24’… ఆతర్వాత టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌తో ‘బ్రహ్మోత్సవం’, నితిన్‌తో ‘అ..ఆ’ సినిమాలతో ప్రతి చిత్రానికి మిలియన్ డాలర్లు వసూలు చేసిన సమంత… ఇప్పుడు ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’తో కూడా మిలియన్ డాలర్లు వసూలు చేసి తన రికార్డుల పరంపరను కొనసాగిస్తోంది. అంతేకాదు ఐదారు నెలల్లోనే సమంత 5 మిలియన్ డాలర్ల సినిమాలతో రికార్డు సృష్టించింది. ఇంతచేసినా సమంత మాత్రం… ఈ రికార్డులన్నీ డైరెక్టర్ల గొప్పతనమే తప్ప నేను చేసింది ఏమీ లేదని, నావల్లే సినిమాలు ఆడవు కదా అని చెప్పి తన గొప్ప మనసును చాటుకుంది. ఏదేమైనా ఇప్పటి స్టార్ హీరోయన్లలో ఈ రికార్డులు సమంతకు మాత్రమే సాధ్యం అనేలా తన సూపర్‌సక్సెస్‌ను కొనసాగిస్తోంది.