Home జయశంకర్ భూపాలపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య..

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య..

Collector AmayKumar Said Good Teaching In Govt Schools

భూపాలపల్లి :తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఉచిత నాణ్యమైన విద్యను పొందాలని జిల్లా కలెక్టర్ దుగ్యాల అమయ్ కుమార్ తల్లిదండ్రులకు సూచించారు.గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి భూపాలపల్లి మండలంలోని ఎస్‌ఎమ్ కొత్తపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత,ప్రాధమిక పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసి 4వ,8వ,10 వతరగతి విద్యార్థులతో ముచ్చటించి 8వతరగతి విద్యార్థులకు విద్యార్థులకు సైన్స్ ఇంగ్లీష్,లెక్కల పాఠాలను 10వతరగతి విద్యార్థులకు సాంఘీకశాస్త్రం పాఠాలను బోధించారు. విద్యార్థుల అభ్యసన స్థాయిలను గమనించారు. ఈసందర్భంగా గత సంవత్సరం వరకు ప్రైయివేట్ పాఠశాలలో చదివి ఈసంవత్సరం 8వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం పొందిన విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కన్నా చదువులో వెనుక బడి ఉండటం గమనించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ..ప్రైవేట్ బడులపై మోజులో తల్లిదండ్రులు తమ పిల్లలను పిల్లలను విద్యహర్హతలు లేకుండా చెప్పే ప్రైవేటు బడులకు పంపడం వలన వారి పిల్ల భవిష్యత్‌లను నాశనం చేస్తున్నారని ఆయన అన్నారు. అలాగే మధ్యాహ్నం భోజనం రుచి చూసి వంట బాగా చేశారని ప్రతి రోజు ఇలాగే విద్యార్థులకు భోజనం అందించాలని అన్నారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల భవనాలకు ఏకరూప రంగులు వేయించాలని పాఠశాలల ఉన్న చిన్న రిపేర్లను చేయించాలని అధికారులను ఆదేశించారు.ఎస్‌ఎమ్ కొత్తపల్లిలో జిల్లా ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం బోజనం వండటానికి గ్యాస్ సిలిండర్లను అందించాలని అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.విద్యార్థుల అభ్యసన స్థాయిలను బట్టి గ్రేడుల వారిగా విభజించి చదువులో వెనుక బడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని విద్యాశాఖాధికారిని ఆదేశించారు.