Home ఆదిలాబాద్ అధికారులు ప్రణాళికలు సిద్దం చేయాలి: కలెక్టర్ దివ్య

అధికారులు ప్రణాళికలు సిద్దం చేయాలి: కలెక్టర్ దివ్య

Collector divya speaking about Rythu bandhu checks
ఆదిలాబాద్ టౌన్‌ః ఈనెల 10 నుంచి పట్టాపాస్ బుక్, రైతు బంధు చెక్కులను పంపిణీ ఉన్నందున అధికారులు మందస్తు ప్రణాళిలు సిద్దం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేవ మందిరంలో రైతు బందు పథకంపై రెవెన్యూ, వ్యవసాయ, మండల ప్రత్యేక అధికారులు, బ్యాంకర్లలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ, వ్యవసాయ, మండల ప్రత్యే అధికారులు సమన్వయం చేసుకొని రైతు బందు పథకం నిర్వహణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తసీఉకోవాలన్నారు. మండల స్థాయిలో ప్రత్యేకాధికారులు రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో గ్రామాల వారీగా ఏ రోజు ఏ గ్రామంలో నిర్వహిస్తారో ముందస్తుగా ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. ప్రత్యేక అధికారులు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఫ్లెక్సీ, బ్యానర్ ఏర్పాటు, సౌండ్ సిస్టం ద్వారా అనౌస్మెంట్ చేయించాలన్నారు. కార్యక్రమం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించాలన్నారు. పంపిణీ చేసిన చెక్కులను మూడు నెలల వరకు పరిమితి ఉంటుందని రైతులకు తెలియజేయాలన్నారు. బ్యాంక్ అధికారులు ఏ గ్రామ రైతులు ఏ బ్రాంచ్‌కి వస్తారో ముందస్తుగా ప్రణాళికలు తయారు చేసుకొని రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేవంలో జేసీ సంధ్యారాణి, జడ్‌పీ సీఈవో జితేందర్ రెడ్డి, డీఆర్‌డీవో పీడీ రాజేశ్వర్ రాథోడ్; జేడీ ఆశాకుమారి, ఎల్‌డీఎం ప్రసాద్, ఆర్డీవో సూర్యనారాయణ, జగదీశ్వర్‌రెడ్డి, కలెక్టరేట్ ఏవో ఆరవింద్ కుమార్, మండల ప్రత్యేకాదికారులు తదితరులు పాల్గొన్నారు.