Home రాజన్న సిరిసిల్ల అభాగ్యులు, నిర్భాగ్యుల కోసం ఒకరోజు వేతనం విరాళం

అభాగ్యులు, నిర్భాగ్యుల కోసం ఒకరోజు వేతనం విరాళం

Krishna-Bhasker

– ప్రభుత్వ అధికారులను కోరిన కలెక్టర్ కృష్ణభాస్కర్
– సుముఖత వ్యక్తం చేసిన అధికారులు
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అభ్యాగులు, నిర్భాగ్యులకు చేయూతనిచ్చేందుకు ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందిద్దామని కలెక్టర్ కృష్ణభా స్కర్ అధికారులను కోరగా, విరాళం అందించేందుకు అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కలెక్టర్ కృష్ణభాస్కర్ సోమవారం అధికారు లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అభ్యాగులు, నిర్భాగ్యులకు చేయూతనిచ్చేందుకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం వల్ల తక్షణ సహాయం అందించలేకపోతున్నామని, ప్రభుత్వ అధి కారులు స్వచ్చందంగా ముందుకు వచ్చి తమ ఒకరోజు వేతనాన్ని ఆర్థిక సహాయంగా అందిస్తే మనందరి తరపు న జిల్లా యంత్రాంగం వారికి అండగా నిలబడుతుందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ శాఖల అధికారులు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందించేందుకు ముందుకు వచ్చారు. జిల్లాలో ఇటీవలి కాలంలో ఆత్మహత్యలు అధికం కావడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి నిపుణులతో మాస్ కౌన్సిలింగ్ ర్పాటు చేయించాలని సూచించారు. ప్రభు త్వం, జిల్లా యంత్రాంగం తమ వెంటే ఉందన్న ఆత్మస్థైర్యం నిం పేలా సానుకూల కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి గొర్రెల పెంపకందా రులకు ప్రభుత్వం పెద్దమొత్తంలో ప్రోత్సాహకాలు అందించనున్నందు వల్ల అర్హులైన వారిని గుర్తించి సొసైటీలు రిజిస్ట్రేషన్ చేయించాలని పశు సంవర్దకశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలో సాగునీటి సౌకర్యం లేక పంటలు ఎండిపోతు న్నట్లు తరచూ కథనాలు వస్తున్నందున వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులు, ఇరిగేషన్, రెవెన్యూ అధి కారులు స్పందిం చాలని కలెక్టర్ తెలిపారు. ఏ విధమైన చర్యలు చేపడితే రైతన్నల పంటలు ఎండిపోకుండా జాగ్రత్త పడవచ్చో క్షేత్రస్థాయిలో పర్య టించి నివేదిక అందించాలన్నారు. ప్రస్తుతం ఉన్న పంటలు, సాగు సౌకర్యంపై సవివరమైన రిపోర్టును రూపొందించి అందిం చాలని ఆదేశించారు. త్వరలో గ్రామాల్లోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే కార్యక్రమా లను చేపట్టను న్నామని,అధికారులు వీటి విజయవ తానికి సహకారం అందిం చాలని కలెక్టర్ కోరారు.

త్వరలో పది పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నందు వల్ల విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో కుర్చీలు, త్రాగునీరు, వె లుతురు ఉండేలా చూడాలన్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయా లను జియో ట్యాగింగ్ చేసేందుకు చర్యలు చేపడుతున్నందు వల్ల హెల్త్, వెల్ఫేర్, ఎడ్యుకేషన్ సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు జియో కో ఆర్డినేట్స్‌ను పంపాలని సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవ త్సరం ముగింపుకు కొద్దిరోజులే మిగిలి ఉన్నందున ప్ర భుత్వ శాఖలకు ప్రభుత్వం వివిధ పద్దుల కింద కేటాయించిన నిధులు పూర్తి స్థాయిలో ఖర్చు చే యాలన్నా రు. నిధులు మిగిలి పోయినట్లు గుర్తిస్తే బాధ్యులపై చర్యలు తప్పవన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌వో శ్యాంప్ర సాద్‌లాల్, ఆర్డీవో పాండురంగ, ఇతర అధికారులు పాల్గొన్నారు.