Home కామారెడ్డి నకిలీ విత్తనాలపై కలెక్టర్ సమీక్ష

నకిలీ విత్తనాలపై కలెక్టర్ సమీక్ష

Collector Meeting with Officials on Fake Seeds Selling

మనతెలంగాణ/నిజామాబాద్: నకిలీ విత్తనాలను అరికట్టడంలో టాస్క్‌ఫోర్స్ విశేష కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్‌లో జరిగిన సమావేశంలో నకిలీ విత్తనాల అంశంపై సమీక్షించారు. ఈ సందర్భంగా  కలెక్టర్ రామ్మోహన్‌రావు మాట్లాడుతూ వ్యవసాయ, పోలీసు, లీగల్ మెట్రా లజీ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు రెగ్యూలర్‌గా తనిఖీలు చేయాలని ఆదేశించారు. ప్రతినెల 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు నిర్వహించే తనిఖీలు కాకుండా ప్రతిరోజు తనిఖీలు చేసే నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి రాకుండా చర్య లు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కువగా వరి పంట పండిస్తున్నందున ఇతర జిల్లాల నుండి వేరే విత్తనాలు ఇక్కడ కేంద్రంగా చేసుకొని ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశం ఉన్నందున వెళ్లకుండా ట్రాన్స్‌పోర్టేషన్ ప్రదేశాల్లో విస్తృతంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లు, ప్రైవేట్ రవాణా సంస్థల వద్ద నిఘా పెట్టి ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ రవా ణా రాకుండా నిరోధక చర్య లు తీసుకోవాలన్నారు. విత్తన ధృవీకరణ సంస్థ అధికారులు ధృవీకరణ చేసిన విత్తనాల పరిస్థితి ఏ విధంగా ఉందో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని ఆదేశించారు. ఒక యూనిట్ కాకు ండా ఒక్కొక్క రైతుకు చెందిన పంట పొలాలను పరిశీలన చేసి సరఫరా చేసిన విత్తనాల పరిస్థితిని చూడాలని అధికారులను ఆదేశించారు. శాఖాపరంగా చేసే తనిఖీల సమాచారాన్ని ఇతర శాఖలు పంచుకోవాలని సమాచారాన్ని సంబంధిత శాఖలకు అందించాలని సూ చించారు. ప్రతి 15 రోజులకోకసారి సమీక్షా సమావేశం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయధికారి గోవిం ద్, ఎడి మాజీద్ హుస్సెన్, అగ్నిమాపక, లీగల్ మెట్రాలజీ విత్తనాల శాఖ, విత్తన ధృవీకరణ సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.