Home సిద్దిపేట సమ్మె విరమించండి

సమ్మె విరమించండి

 Collector Padmakar Ask Stop The Ration Dealers Strike

మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్ : నిత్యవసర సరుకులు అందించే విషయం లో ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా సమ్మెను విరమింపజేయాలని సిద్దిపేట జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్, డీఎస్‌వో వెంకటేశ్వర్‌రావుతో కలిసి రేషన్ డీలర్లను కోరారు. శనివారం జిల్లాలోని తహశీల్దార్లు, ఐకేపీ సిబ్బంది, గోదాం ఇంచార్జీలతో కలెక్టరేట్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ డీలర్లతో పలు మా ర్లు సమావేశాలు నిర్వహించామని, అయిన ఫలితం లేదన్నారు. వారి సమస్య ను పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిందని ఈ కమిటీలో రేషన్ డీలర్లను కూడా భాగస్వాములను చేసిందన్నారు. నిరుపేదలు, ఆహార భద్రతకు ఆటంకం కలిగించే విధంగా డీలర్లు వ్యవహరించడం సరికాదన్నారు.
5వ తేది నుంచి సరుకులు అందిస్తాం
రేషన్ డీలర్లు సమ్మె చేస్తున్న ప్రజలకు సకాలంలో నిత్యావసర సరుకులు అందిస్తామని జెసీ తెలిపారు. డీలర్లకు ప్రత్యామ్నాయంగా గ్రామీణ ప్రాంతాలలో 592 మహిళా సంఘాలను, పట్టణ ప్రాంతాలలో మెప్మా ఆధ్వర్యంలో 88 సంఘాలను గుర్తించామని సరుకుల నిర్వాహణ పంపిణీ కోరకు 260 ఐకేపీ భవనాలను  186 గ్రామ పంచాయతీలు, 73 కమ్యూనీటి భవనాలు, 161  ఇతర భవనాలను గుర్తించామన్నారు. ఈ నెల 5వ తేది నుంచి  పదవ తేది వరకు  ఆయా ప్రాంతాలలో సరుకులను పంపిణీ చేస్తామన్నారు. అవసరం ఉన్న చోట పంపిణీ గడువును పొడగిస్తామన్నారు.  ప్రజలు సరుకులు అందవని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని  అర్హులైన ప్రతి ఒక్కరికి  నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామన్నారు. ప్రకడ్బందిగా పంపిణీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. సరుకులు అందకపోయిన సరుకులు తీసుకోవడంలో ఎలాంటి సమస్యలు ఎదురైన ఇతర ఫిర్యాదు ఉంటే ట్రోల్ ఫ్రీ నంబర్ 08457 230000, 7995050809, 08457 231099 నంబర్లకు పోన్ చేసి  ఫిర్యాదులు చేయవచ్చన్నారు. రాష్ట్ర స్థాయిలో  పౌర సరఫరాల శాఖ భవనంలో 1967 టోల్ ప్రీ నంబర్, 7330774444కు వాట్సప్ చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్ధార్లు, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.