Home తాజా వార్తలు గ్రామాలను అభివృద్ది పథంలోకి తీసుకెళ్లాలి : కలెక్టర్ ప్రశాంతి

గ్రామాలను అభివృద్ది పథంలోకి తీసుకెళ్లాలి : కలెక్టర్ ప్రశాంతి

Collector Prasanthiనిర్మల్ ప్రతినిధి : గ్రామాల అభివృద్దే లక్ష్యంగా అంకితభావంతో పని చేసి గ్రామాలను అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ ఎం. ప్రశాంతి నూతనంగా నియమించబడిన పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో కడెం, దస్తురాబాద్, ఖానాపూర్, పెంబి, లక్ష్మణచాంద, మామడ,దస్తురాబాద్ మండలాల్లోని నూతనంగా నియమించబడిన పంచాయతీ కార్యదర్శులకు జాతీయ ఉపాధిహామీ పథకం, తెలంగాణకు హరితహారం , స్వచ్చభారత్ మిషన్ కార్యక్రమాలపై ఒక రోజు ఓరిమెంటేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడారు. గ్రామాల అభివృద్దిలో కార్యదర్శి పాత్ర కీలకమని, ప్రతి ఒకరూ చిత్తశుద్దితో పనిచేసి గ్రామాలను అందంగా తీర్చిదిద్దాలన్నారు. గ్రామాల్లో శానిటేషన్ జోన్ ఏర్పాటు చేయాలని, నర్సరీలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి నెల 5వ తేదిన మురుగునీటి కాలువలను శుభ్రం చేయించాలని పేర్కొన్నారు. ఇంటింటి వెళ్లి ప్రతీ ఒకరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి గ్రామంలో జూలై చివరి నాటికి డంపింగ్ యార్డ్‌లు నిర్మాంచాలని ఆదేశించారు. అనంతరం జిల్లా అటవీ అధికారి ఎన్‌విఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడారు. వాతావరణ సమతుల్యం కోసం అడవుల శాతంను 23 శాతం నుంచి 33 శాతం పెంచాలని సూచించారు. ఈ ఏడాది హరితహరంలో 100 కోట్ల చెట్లను నాటాలని ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో 2.10 కోట్ల లక్షంగా మొక్కలు నాటాలన్నారు. కోతుల బెడద జిల్లాలో అధికంగా ఉందని,  కోతులు అడవిలో పండ్లు, మొక్కలు లేనందున జనావాసాల్లోకి వస్తున్నాయన్నారు. అనంతరం గ్రామీణాభివృద్ది అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడారు. జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా ప్రతీ కుటుంబానికి వంద రోజుల పని కల్పిచి పేదలకు జీవనోపాధి కల్పించాలన్నారు. అలాగే స్త్రీ, పురుషులు బేదాం లేకుండా అందరికి సమానంగా వేతనం చెల్లించాలన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు వివిధ శాఖల సమన్వయంతో పనులను గుర్తించాలన్నారు. సుస్థిర అభివృద్దికి గ్రామ ప్రణాళికలు రూపోందించాలన్నారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ మాట్లాడారు పంచాయతీ కార్యదర్శులు తమ విధులు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. గ్రామాల్లో పారిశుద్దం, ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మాణాలు, నర్సరీలు ఏర్పాటు, డంపింగ్‌యార్డ్‌ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్‌బాబు, కాసాని జగదీశ్వర్, ఎంపిడిఓ మోహన్, మల్లేశం, రమేష్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Collector Prasanthi Comments on Rural Development