Home తాజా వార్తలు డబుల్‌ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణాల పరిశీలన

డబుల్‌ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణాల పరిశీలన

Double Bedroom Houses

 

బల్కంచెలుక తండాలో కలెక్టర్ పర్యటన

27న జిల్లాకు ఆర్థిక శాఖ మంత్రి రాక

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ హన్మంతరావు

సంగారెడ్డి : డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను ప్రారంభించడానికి సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ హన్మంతరావు ఆదేశించారు. సోమవారం కల్హేర్ మండలంలోని బల్కంచెలుకతండాలోని రెండు పడుకల ఇండ్లను పరిశీలించారు. 27న మంత్రి హరీష్‌రావు ప్రారంభిస్తారని అన్ని విధాలుగా ఏర్పా ట్లు చేయాలని సూచించారు. తిరిగి ఇండ్లను పరిశీలించారు.

గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు. రెండు పడకల సమావేశంలో మాట్లాడుతూ చేయవలసిన పనులను అధికారులతో సమీ క్ష సమావేశం నిర్వహించారు. నీటి సరఫరా విద్యుత్‌చెట్లను ఇంటి ముందు పెట్టాలని గ్రామంలో హరితహారం పెద్ద ఎత్తున పెట్టాలని సూచించారు.

గ్రామ సమావేశంలో 50 రెండుపడకల గదుల డ్రా తీయడం జరిగింది. డ్రా వచ్చిన వారికి ఇం డ్లను శుభ్రంగా చేసుకోవాలని 27న గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పండగల గృహ ప్రవేశాలు చేయాలని, ఇంకుడుగుంతలు చెత్త సేకరణ వంటి కార్యక్రమాల్లో ముందుండాలని గ్రామ ప్రజలకు జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో డీపీవో వెంకటేశ్వర్లు, డీఎఫ్‌వో , డీఆర్‌డిఏ పీడి, గ్రామసర్పంచ్ ఎం.లలిత కిషన్ తదితరులు పాల్గొన్నారు.

మెమో జారీ చేసిన కలెక్టర్ :
కల్హేర్ మండలం మీర్‌ఖాన్‌పేట గ్రామ సర్పంచ్ నీరుడు బాగ్యలక్ష్మీకి కలెక్టర్ హన్మంతరావు మోమో జారీచేశారు. సోమవారం మీర్‌ఖాన్‌పేట గ్రామాన్ని ఆకస్మీకంగా తనిఖీ చేశారు. గ్రామంలో పారిశుద్ద పనులు కావడం లేదని మెమె జారీచేసినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.

Collector who Observed of Double Bedroom Houses