Friday, March 29, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన నల్గొండ జిల్లా కలెక్టర్

- Advertisement -
- Advertisement -

Green India Challenge

 

హైదరాబాద్ : టిఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భఁగా
మరో ముగ్గురిని నామినేట్ చేశారు. నల్గొండ జిల్లా ఎస్‌పి సూర్యాపేట జిల్లా కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌కు మొక్కలు నాటాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంత్ జీవన పాటిల్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ భావితరాలకు ఎంతో ఉపయోగకరమైనదని వ్యాఖ్యానించారు.

ప్రపంచవ్యాప్తంగా అందరిని ఆందోళనకి గురిచేస్తున్న సమస్య పర్యావరణలో వచ్చే పెనుమార్పులను గ్రహించే సిఎం కెసిఆర్ 2014లో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. తనకు వ్యక్తిగతంగా బాగా నచ్చిన కార్యక్రమమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఎంపి సంతోష్ కుమార్‌కు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. దీనిని జిల్లావ్యాప్తంగా తీసుకెళ్లడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.

మొక్కలు నాటిన జెడ్‌పిహెచ్ స్కూల్ విద్యార్ధులు, ఉపాధ్యాయులు
గ్రీన్ ఇండియా ఛాలెంజ్, రోజా వనం సంయుక్తంగా నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తడుకులోని జెడ్‌పిహెచ్ స్కూల్‌లో సోమవారం హెడ్‌మాస్టహర్ సురేష్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమమం సైన్స్ టీచర్లు కె.భాను ప్రసాద్, పరమేశ్వరి, మురళితో పాటు పలువురు విద్యార్ధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ, పిల్లలకు మొక్కల పెంపకం , వాటి ప్రాధాన్యత చిన్నప్పటి నుంచి నేర్పాలని పిలుపునిచ్చారు. దానివల్ల విద్యార్ధుల్లో చిన్నప్పటి నుంచే జాలి, దయ ఏర్పడుతుందన్నారు.

పరోక్షంగా పర్యావరణ పరిరక్షణకు వారు కూడా బాల్యం నుంచే భాగస్వామ్యం అవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపి సంతోష్ కుమార్‌ను ఆదర్శంగా తీసుకోవాలని పిల్లలకు ఆయన సూచించారు. ఈ వేసవి దృష్టిలో ఉంచుకుని నీటి సౌలభ్యం ఉన్న ప్రాంతాల్లో మొక్కలు నాటిపెట్టిన మొక్కలు ఎదిగేందుకు బాధ్యత వహించాలని నగరి ఎంఎల్‌ఎ రోజా ఉపాధ్యాయులను కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ముందుకు తీసుకెలుతున్న రోజాను ఈ సందర్భంగా ఎంపి సంతోష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.

Collector who planted plants in the Green India Challenge
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News