Saturday, April 20, 2024

కర్ణాటక హైకోర్టులో పెర్మనెంట్ జడ్జిలుగా ఆరుగురికి కొలిజియమ్ అంగీకారం

- Advertisement -
- Advertisement -

Collegium approves six permanent judges in Karnataka High Court

న్యూఢిల్లీ : కర్ణాటక హైకోర్టులో పెర్మనెంట్ జడ్జిలుగా ఆరుగురు అదనపు జడ్జిలను నియమించే ప్రతిపాదన కు సుప్రీం కోర్టు కొలిజియమ్ అంగీకరించింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వం లోని కొలీజియమ్ ఆగస్టు 17 న ప్రతిపాదనను అంగీకరించింది. పెర్మనెంట్ జడ్జిలుగా జస్టిస్‌లు నేరనహళ్లి శ్రీనివాసన్ సంజయ గౌడ, జ్యోతి ములిమని, నటరాజ్ రంగస్వామి, హేమంత్ చందన్ గౌడార్, ప్రదీప్ సింగ్ యేరూర్, మహేశన్ నాగప్రసన్న లను కొలిజియమ్ అనుమతించింది. కొల్‌కతా హైకోర్టు అడిషనల్ జడ్జి జస్టిస్ కౌశిక్ చందాను కూడా పెర్మనెంట్ జడ్జిగా కొలిజియమ్ అనుమతించింది. చీఫ్ జస్టిస్ రమణతోపాటు జస్టిస్‌లు యుయు లలిత్ , ఎఎం ఖాన్‌విల్కర్ కూడా త్రిసభ్య కొలిజియమ్‌లో సభ్యులుగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News