Thursday, April 25, 2024

సుప్రీంకోర్టు జడ్జిగా హిమాకోహ్లి

- Advertisement -
- Advertisement -

Collegium recommends nine judges for SC including Telangana CJ

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా తెలంగాణ సిజెతో పాటు తొమ్మండుగురు పేర్లను సిఫారసు చేసిన కొలీజియం

మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ పిఎస్ నరసింహా పేరును కూడా
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి సిఫారసు రాష్ట్ర హైకోర్టు
న్యాయమూర్తులుగా న్యాయాధికారుల కోటా నుంచి ఏడుగురి పేర్లు సిఫారసు

న్యూఢిల్లీ/హైదరాబాద్ : సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా తొమ్మండుగురు పేర్లను కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ విషయాన్ని సు ప్రీంకోర్టు బుధవారం అధికారిక ప్రకటనలో వెలువరించింది. వీరిలో తెలంగాణ హైకోర్టు సిజె హిమా కోహ్లి కూడా ఉన్నారు. ఆమెతో పాటు కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభయ్ శ్రీనివాస్ ఒకా, గుజరాత్ సిజె విక్రమ్ నాథ్, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్ర కుమార్ మహేశ్వరి పేర్లు కొలీజియం సిఫార్సు జాబితాలో ఉన్నాయి. వీరు కాకుండా న్యాయమూర్తులు బివి నాగరత్న (కర్నాటక హైకోర్టు), సిటి రవికుమార్ (కేరళ హైకోర్టు), ఎంఎం సుం ద్రేష్ (మద్రాసు హైకోర్టు), బేలా త్రివేది(గుజరాత్ హైకోర్టు) పేర్లను సిఫార్సు చేశారు.

ఇక సుప్రీంకోర్టు ధర్మాసనానికి లాయర్ల నుంచి నేరుగా తీసుకునే న్యాయమూర్తి స్థానానికి సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ పి ఎస్ నరసింహ పేరును ప్రతిపాదించారు. భారత ప్రధాన న్యా యమూర్తి సారథ్యంలో కొలీజియం వ్యవహరిస్తుంది. న్యాయమూర్తుల సీనియార్టీ, ఇతర అంశాల ప్రాతిపదికన అత్యున్నత న్యాయస్థానానికి జడ్జిల ఎంపిక ప్రక్రియను పరిశీలన తరువాత కేంద్రానికి సిఫార్సు చేయడం ఆనవాయితీగా ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టుకు సిఫార్సు చేసిన వారిలో ముగ్గురు హైకోర్టు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు.

ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ హిమా కోహ్లీ పేరును కూడా పదోన్నతి ద్వారా సుప్రీంకోర్టు జడ్జి స్థానానికి సిఫార్సు చేశారు. ఈ నెల 17వ తేదీన కొలీజియం సమావేశం జరిగింది. వివిధ హైకోర్టులకు చెందిన నలుగురు ప్రధాన న్యాయమూర్తులకు పదోన్నతి ద్వారా సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమించాలని సిఫార్సు చేయడం కీలక పరిణా మం అయింది. ఈ నెల 12వ తేదీన జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్ పదవీ విరమణ చేశారు. దీనితో అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులు సంఖ్య 25కు తగ్గింది.

బుధవారమే మరో సీనియర్ న్యాయమూర్తి నవీన్ సిన్హా పదవీ విరమణ చేశారు. దీనితో ఇప్పుడు జడ్జిల సంఖ్య 24 అయింది. సాధారణంగా సుప్రీంకోర్టుకు సిజెఐ సహా ఉండాల్సిన న్యాయమూర్తుల స ంఖ్య 34. సిజెఐగా రంజన్ గొగోయ్ 2019 మార్చి 19లో పదవీ విరమణ చేసిన నాటి నుంచి ఇప్పటివరకూ జడ్జిల నియామకాలు జరగలేదు. దాదాపు రెండేళ్లకు నియామకాల సిఫార్సులు వెలువడ్డాయి. ఐదుగురు సభ్యుల కొలీజియంలో న్యాయమూర్తులు యువి లలిత్, ఎ ఎం ఖాన్విల్కర్, డి వై చంద్రచూడ్, ఎల్ నాగేశ్వర రావు సభ్యులుగా ఉంటారు. దీని సారధ్య బాధ్యత ప్రధాన న్యాయమూర్తిదే అవుతుంది. కొలీజియం ఇప్పుడు సిఫార్సు చేసిన పేర్లకు కేంద్రం ఆమోదం తెలిపితే, ఇప్పుడున్న ఖాళీలు భర్తీ అవుతాయి. జడ్జిల సంఖ్య 33కు చేరుతుంది.

రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు
ఏడుగురి పేర్లు సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం నాడు సిఫార్సు చేసింది. కొలీజియం సిఫారసు చేసిన వారిలో సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి జస్టిస్ పి.శ్రీరాధ, జ్యూడీషియల్ అకాడమీ డైరక్టర్ సి.సుమలత, తెలంగాణ వ్యాట్ ట్రైబ్యునల్ ఛైర్‌పర్సన్ జి.రాధారాణి, ఖమ్మం ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఎం.లక్ష్మణ్, తూర్పుగోదావరి జిల్లా ప్రిన్సిపల్ జడ్జి తుకారాంజీ, రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎ.వెంకటేశ్వరరెడ్డి, ఇన్‌కంట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్ జ్యుడీషియల్ సభ్యులు పి.మాధవిదేవిలున్నారు. వీరిని హైకోర్టు జడ్జిలుగా పదోన్నతిపై నియమించాలన్న ప్రతిపాదనలకు సుప్రీం కొలీజియం ఆమోదం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News