Home మెదక్ యాగానికి రండి

యాగానికి రండి

నేడు ఎర్రవల్లి గ్రామస్థులను ఆహ్వానించనున్న సిఎం
KCRజగదేవ్‌పూర్: తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని తలపెట్టిన అయుత మహాచండీ యాగం పనులను గురువారం మధ్యాహ్నం సిఎం కెసిఆర్ తన సతీమణి శోభ, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, దేవాదాయ శాఖమంత్రి ఇంద్రాకరణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్‌ల తో కలిసి పరిశీలించారు. జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని తన వ్యవసాయక్షేత్రంలో సిఎం పర్యటించి చండీయాగం పనులను పరిశీలించారు. సిఎం ఎర్రవల్లి గ్రామస్తులను చండీ యాగానికి రావాల్సిందిగా శుక్రవారంనాడు ఆహ్వానించనున్నట్లు తెలిసింది. యాగశాలను సందర్శించిన సిఎం జరుగుతున్న పనుల గురించి నిర్వహకులను అడిగి తెలుసుకున్నారు. యాగశాలలను, యజ్ఞ హోమ గుండాలను పరిశీ లించారు. అలాగే కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు, వివిఐపి, విఐపిలు,అయుత చండీ యాగానికి హాజరుకానున్నారు. వివిఐపిల కోసం మరో 3 పత్యేక కుటీరాలను నిర్మించారు. చండీ యాగం పనులు ఎలా జరుగుతున్నాయి అని పరిశీలించారు. 5 రోజుల పాటు నిర్వహించ డం జరుగుతుంది కావునా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలి, అదేవిధంగా పార్క్‌ంగ్‌తో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సిఎం అధికారులకు, కార్య నిన్వాహకులకు సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో పలువురు పాల్గొన్నారు.